March 18, 202508:34:36 AM

Pushpa3: పుష్ప 3 రిలీజ్ పై హింట్ ఇచ్చిన నిర్మాత.. ఎప్పుడంటే?

Pushpa3 release hint from makers

‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) భారీ హిట్ కావడంతో పుష్ప 3 ఎప్పుడొస్తుందనే ప్రశ్న ఇప్పుడు సినీప్రియుల్లో హాట్ టాపిక్‌గా మారింది. మొదటి భాగం పాన్ ఇండియా హిట్ కాగా, రెండో భాగం అయితే తెలుగు సినిమా రేంజ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. భారీ వసూళ్లతో పాటు, పుష్ప క్యారెక్టర్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు పెరగడంతో మూడో భాగంపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే, సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందనే విషయమై నిర్మాత క్లారిటీ ఇచ్చారు.

Pushpa3

Pushpa3 release hint from makers

తాజాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత వై. రవిశంకర్ (Y .Ravi Shankar), విజయవాడలో జరిగిన రాబిన్ హుడ్ (Robinhood) ప్రమోషన్ ప్రెస్‌మీట్‌లో పుష్ప 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ “పుష్ప 3 వస్తుంది.. కానీ 2028లోనే వస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు. అంటే ఇప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం లేదన్న విషయం స్పష్టమైంది. దీనికి కారణం అల్లు అర్జున్  (Allu Arjun) , సుకుమార్  (Sukumar) ఇద్దరూ బిజీగా ఉండటమే.

Pushpa3 The Rampage

సుకుమార్ రామ్ చరణ్‌తో (Ram Charan) ‘RC17’ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే పుష్ప 3 స్క్రిప్ట్‌పై పూర్తిగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. ఇక అల్లు అర్జున్ కూడా వరుసగా అట్లీ (Atlee Kumar), త్రివిక్రమ్ (Trivikram), సందీప్ వంగా (Sandeep Reddy Vanga) లాంటి ప్రముఖ దర్శకులతో సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాతే పుష్ప 3 సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది.

Naveen Yerneni Pushpa3 release hint from makers

అయితే, పుష్ప 2లో చివరి భాగం ఓ కొత్త ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil)   పాత్ర మరింత పవర్ఫుల్‌గా మారడంతో మూడో భాగంలో కథ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. దాంతో, అభిమానులు 2028 వరకు ఆగకుండా ముందే ఈ ప్రాజెక్ట్‌ను మొదలు పెడతారా? అన్నదానిపై ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ స్పష్టతతో 2028లో పుష్ప 3 ఖచ్చితంగా వస్తుందని తెలిసింది. అయితే, అభిమానులు మాత్రం ఇది ముందే సెట్స్‌పైకి వెళితే బాగుంటుందనుకుంటున్నారు.

కల్కి 2: ఆ పాత్రకు హై వోల్టేజ్ ఎలివేషన్స్ గ్యారెంటీ!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.