March 17, 202507:40:22 AM

Vijay Deverakonda: రిలేషన్ షిప్ స్టేటస్ పై క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ను కలిగి ఉన్న హీరోలలో విజయ్ దేవరకొండ  (Vijay Devarakonda) ముందువరసలో ఉంటారు. మరో ఐదు రోజుల్లో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ కానుంది. దిల్ రాజు (Dil Raju) బ్యానర్ కు సక్సెస్ రేట్ ఎక్కువ కావడంతో ఈ సినిమా కూడా హిట్ గా నిలుస్తుందని చాలామంది ఫీలవుతున్నారు. విజయ్ దేవరకొండ తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి, ది ట్యాగ్ గురించి స్పందించారు.

యాక్టర్ల పేర్ల ముందు స్టార్ ట్యాగ్స్ పెట్టే సాంప్రదాయం ఎక్కడినుంచి వచ్చిందో నాకు తెలియదని విజయ్ దేవరకొండ అన్నారు. నా సినిమాల ప్రొడ్యూసర్లు సైతం నాకు ఏదైనా టైటిల్ పెట్టాలని చూశారని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సమయంలో వాళ్లకు నేను ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాడినని విజయ్ దేవరకొండ కామెంట్లు చేశారు. నా పేరు నాకు సరిపోతుందని నేను భావించానని ఆయన అభిప్రాయపడ్డారు.

అమ్మానాన్నలు పెట్టిన పేరుతో నేను సంతోషంగా ఉన్నానని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ ఒక్కడే కాబట్టి నాకేమైనా టైటిల్ పెట్టాలని అనుకుంటే ది అని యాడ్ చేయాలని ఇటీవలే చెప్పానని ఆయన తెలిపారు. దానిని మించి నాకేం నచ్చలేదని ఆయన పేర్కొన్నారు. రిలేషన్ షిప్ లో ఉన్నారా అంటే అవునని విజయ్ దేవరకొండ అన్నారు.

నా పేరెంట్స్, సోదరుడు, స్నేహితులతో రిలేషన్ షిప్ లో ఉన్నానని ఆయన కామెంట్లు చేశారు. ఫ్యామిలీ స్టార్ (Family Star) ప్రతి ఒక్కరికీ నచ్చే మూవీ అని ఇలాంటి కథలో భాగం కావడం లక్ గా భావిస్తున్నానని ఆయన తెలిపారు. గీతా గోవిందం (Geetha Govindam) తర్వాత పరశురామ్ (Parasuram) , విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతుండగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.