March 19, 202510:24:08 PM

Arjun Son Of Vyjayanthi Teaser Review: తల్లీ కొడుకుల మధ్య సం’ఘర్షణ’!

Arjun Son Of Vyjayanthi Teaser Review

కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) సినిమా రూపొందుతుంది. ‘అశోకా క్రియేషన్స్’ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ సంస్థలు నిర్మిస్తున్నాయి. సీనియర్ హీరోయిన్ విజయశాంతి  (Vijaya Shanthi) .. ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) తర్వాత ఈ సినిమాలో కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ టీజర్ విషయానికి వస్తే.. ఇది 1 :56 నిమిషాల నిడివి కలిగి ఉంది.

Arjun Son Of Vyjayanthi Teaser Review:

Arjun Son Of Vyjayanthi Teaser Review

’10 సంవత్సరాల నా కెరియర్లో ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్… కానీ చావుకి ఎదురెళ్తున్న ప్రతిసారి నా కళ్ళ ముందు కనిపించే మొహం.. నా కొడుకు అర్జున్’ అంటూ విజయశాంతి చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలైంది. ఆ తర్వాత హీరో కళ్యాణ్ రామ్ ఎంట్రీ. వీళ్లిద్దరి మధ్య బాండింగ్ కి సంబంధించిన విజువల్స్ చూపించారు. అటు తర్వాత హీరో పోలీస్ కావాలని తల్లి ఆరాటపడుతుంది. హీరో కూడా ఆ లక్ష్యంతో ముందడుగు వేస్తాడు. కానీ పరిస్థితులు అతన్ని డాన్ అయ్యేలా చేస్తాయి.

చెడును అంతం చేసే క్రమంలో అతని తల్లికే అతను ఎదురు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే డ్యూటీలో ఉన్నా లేకపోయినా.. తప్పు చేసింది బంధువైన ఇంకెవరైనా.. ఆమె క్షమించను అంటుంది. వీరి మధ్య సంఘర్షణే మిగిలిన కథ అన్నట్టు హింట్ ఇచ్చారు. టీజర్ ద్వారా చాలా వరకు కథని చెప్పేశారు. తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ పాయింట్ పండేలా కనిపిస్తుంది. ఈ సమ్మర్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.