Allari Naresh: ఆ సినిమా షూట్ సమయంలో నరకం చూశా.. అల్లరి నరేష్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో అల్లరి నరేష్ (Allari Naresh) ఒకరు కాగా అల్లరి నరేష్ ఒకప్పుడు గ్యాప్ లేకుండా సినిమాలలో నటించేవారు. ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్న నరేష్ విభిన్నమైన కథాంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అల్లరి నరేష్ సినీ కెరీర్ లో ఫ్లాప్ సినిమాలు కూడా ఉండగా ఒక ఇంటర్వ్యూలో నరేష్ మాట్లాడుతూ లడ్డూబాబు (Laddu Babu) సినిమాకు సంబంధించి షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. ఆ సినిమా షూటింగ్ అనుభవాలను అల్లరి నరేష్ పంచుకున్నారు.

“నేను” (Nenu) సినిమా చూసి గమ్యం (Gamyam) , మహర్షి (Maharshi) సినిమాలలో ఆఫర్లు ఇచ్చారని ఆయన అన్నారు. సుడిగాడు తర్వాత నా సినిమాలపై అంచనాలు పెరిగాయని అల్లరి నరేష్ పేర్కొన్నారు. లడ్డూబాబు సినిమాలో నేను నటించినట్టు లేదని చాలామంది చెప్పారని ఆయన అన్నారు. ఆ సినిమా కోసం చాలా ఇబ్బంది పడ్డానని నరేష్ తెలిపారు. లడ్డూబాబు సినిమా షూటింగ్ సమయంలో మేకప్ కే చాలా సమయం పట్టేదని నరేష్ అన్నారు.

ఆ సినిమా వల్ల ముఖంపై ర్యాషెస్ వచ్చాయని నరేష్ అన్నారు. ఆ సినిమా సమయంలో మేకప్ ఉండటంతో చెమట వల్ల ఇబ్బందులు పడ్డానని నరేష్ వెల్లడించారు. లడ్డూబాబు కొత్త తరహా సినిమా అవుతుందని భావించానని ఆయన అన్నారు. ఉదయం 4 గంటల లోపే తినాలి తప్ప మేకప్ వేసుకున్న తర్వాత సాలిడ్ ఫుడ్ తినలేమని ఆయన అన్నారు.

ఉదయం మేకప్ కు 4.30 గంటలు సాయంత్రం 90 నిమిషాల సమయం మేకప్ వేయడానికి తీయడానికి పట్టిందని నరేష్ పేర్కొన్నారు. నరేష్ లడ్డూబాబు సినిమా కోసం మేకప్ వేసుకున్న ఆరు రోజుల పాటు సరైన ఆహారం తీసుకోలేదట. సినిమా హిట్టై ఉండి ఉంటే నరేష్ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయినా దక్కేది. నరేష్ త్వరలో ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.