March 20, 202505:05:44 PM

Anasuya: విజయ్‌ సినిమా వచ్చినప్పుడే అనసూయ కామెంట్స్‌… అసలు కారణం ఏంటి?

విజయ్‌ దేవకొండకు (Vijay Devarakonda), అనసూయకు (Anasuya Bhardhwaj) మధ్య జరగిందేంటి? ఈ ప్రశ్న గత కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉంది. బ్యాక్‌ ఎండ్‌లో ఏం జరిగిందో తెలియదు కానీ… విజయ్‌ ట్యాగ్‌ లైన్‌ గురించి, విజయ్‌ మాటల గురించి అనసూయ స్పందిస్తుంటుంది. దానికి విజయ్‌, అతని టీమ్‌ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఈ ప్రహసనానికి కామాలు పడటం తప్ప… ఫుల్‌స్టాప్‌లు పడటం లేదు. తాజాగా మరోసారి ఇదే పరిస్థితి. ఈసారి ఎవరో నెటిజన్‌ అనసూయను లాగారు. అలా అనేకంటే.. ఆమే మధ్యలోకి వచ్చింది అని చెప్పొచ్చు.

విజయ్‌ సినిమా రిలీజ్‌కి దగ్గర పడటం ఆలస్యం ఏదో ఒక రకంగా అనసూయ కామెంట్లు బయటకు వస్తుంటాయి. ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) vవస్తోంది ఇంకా రాలేదేంటి అని అనుకుంటుడగా… ఒక నెటిజన్‌ చేసిన కామెంట్‌కు అనసూయ స్పందిచింది. ఇంత మంది నెటిజన్లలో ఇన్ని కామెంట్స్‌లో ఆ నెటిజన్‌ కామెంట్‌ని ఆమె వెతికి పట్టుకుని మరీ ఎందుకు రిప్లై ఇచ్చింది అనేది ఇక్కడ ప్రశ్న. నెటిజన్లలో చాలామంది చాలా అంటారు. చూసి వదిలేయాల్సిన విషయానికి ఆమె ఎందుకు రియాక్ట్‌ అయిందో ఆమెకే తెలియాలి.

నిజానికి విజయ్‌నో, అనసూయనో ఎవరో ఏదో అనడం, లేదంటే విజయ్‌ టీమ్‌ ఏదో ఓ ట్వీటులు వేయించడం, ఇంకా లేదంటే అనసూయనే ఓ మాట అనడం ఇన్నాళ్లుగా సాగుతూనే ఉంది. ఇప్పుడు కూడా ఓ నెటిజన్‌… విజయ్‌ పీఆర్‌ టీమ్‌ మీద, వాళ్ల ప్రచార ప్రయత్నాల మీద విమర్శిస్తూ అనసూయ పేరు ప్రస్తావించాడు. దానికి అనసూయ రిప్లై ఇస్తూ… ‘‘కార్తీక్‌ అస్తమానం నన్ను ఎందుకు ఈ విషయంలోకి లాగుతుంటారు. ఎవరు ఏం మాఫియా చేస్తున్నారో నేను ఎప్పుడో చెప్పి వదిలేశాను.

అనవసరంగా నేనే హైప్‌ ఇస్తున్నానని నిజమేనేమోనని అనిపించి వదిలేశాను. నాకు సింపథీ అక్కర్లేదు. నాకు నా మీద నమ్మకం.. దేవుడి మీద నమ్మకం ఉంది’’ అని అనసూయ చెప్పింది. మా అమ్మానాన్న నాకిచ్చిన విలువలు, పెంపకం. నన్ను ఎప్పుడూ దిగజారనివ్వవు. నాకు వాళ్లకూ ఎటువంటి సంబంధం లేదు. నేను మీకు ఆంటీ కానేమో. అయినా మీ ఇంట్లో ఒకసారి అడగండి. మీకు తెలియకుండా రిలేషన్స్‌ ఉన్నాయేమో.

ఎందుకంటే చుట్టాలైతేనే ఆ పలకరింపులు ఉంటాయి అంటూ కాస్త గట్ట రిప్లై ఇచ్చింది ‘ఆంటీ పదం’ కోసం. అయితే ఇక్కడ ఒకటే డౌట్‌. విజయ్‌ పీఆర్‌ టీమ్‌ని ఆ నెటిజన్‌ అన్ని మాటలు అంటే.. వాళ్లే రియాక్ట్‌ అవ్వలేదు. ఈమెకు ఇంత రియాక్షన్‌ ఎందుకు అని నెటిజన్లు డౌట్‌ పడుతున్నారు. నిజంగా విజయ్‌ మీద కోపం ఉందా? లేక ప్రచారం కోసం ఇలా చేస్తోందా అనే డౌట్‌ కూడా వ్యక్తం చేస్తున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.