Bellamkonda Srinivas: 3 క్రేజీ ప్రాజెక్టులు.. బెల్లంకొండ లైనప్ బాగానే ఉందిగా!

టాలీవుడ్‌లో ఉన్న యంగ్‌ హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) ఒకరు. ‘అల్లుడు శీను’ (Alludu Seenu), ‘జయ జానకి నాయక’ (Jaya Janaki Nayaka), ‘రాక్షసుడు’ (Rakshasudu) వంటి చిత్రాలతో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే ఇతను చేసే సినిమాలకి రూ.20 కోట్లు రికవరీ ఉంటుంది అంటేనే ఇతని రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే బాలీవుడ్ నిర్మాతలు సైతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సినిమాలు చేయాలని ఎగబడుతున్నారు. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ కలిగిన ఈ నటుడు ఫైట్స్, డాన్స్ కూడా ఇరగదీస్తూ ఉంటాడు.

ఇదిలా ఉండగా.. గత రెండేళ్లలో చూసుకుంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. సినిమాలు తగ్గించాడనే కామెంట్లు ఎక్కువ వినిపించాయి. గతేడాది హిందీలో చేసిన ‘ఛత్రపతి’ మినహా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నుండి మరో సినిమా రాలేదు. ఆ చిత్ర నిర్మాతలు ఇతనితో ఇంకో రెండు సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం శ్రీనివాస్‌..14 రీల్స్ ప్లస్ బ్యానర్లో ‘టైసన్ నాయుడు’ (Tyson Naidu) చేస్తున్నాడు. ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) దర్శకుడు సాగర్ కె చంద్ర (Saagar K. Chandra) ఈ చిత్రానికి దర్శకుడు.

మరోపక్క ‘భగవంత్ కేసరి’ (Bhagavath Kesari) వంటి బ్లాక్ బస్టర్ అందించిన ‘షైన్ స్క్రీన్స్’ వారి నిర్మాణంలో కూడా ఓ చిత్రం చేయబోతున్నాడు. దీంతో పాటు మరో యాక్షన్ మూవీకి కూడా ఇతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఏదేమైనా 2024 లో బెల్లంకొండ మంచి లైనప్ సెట్ చేసుకున్నట్టు స్పష్టమవుతుంది . అంతేకాకుండా ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ లో కూడా ఇతను ఓ సినిమా చేయాల్సి ఉంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.