March 15, 202512:56:06 AM

Trivikram: త్రివిక్రమ్ మనసులో టాలెంటెడ్ హీరోయిన్..సెట్టయితే బ్లాస్ట్?

Can Trivikram convince that actress

సాయి పల్లవిని (Sai Pallavi) ఓ సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలంటే దర్శకులకు మామూలు కష్టం కాదు. ఆమె సినిమా చేసే ముందు విపరీతంగా ఆలోచించే వ్యక్తి. ఇటీవల దర్శకుడు చందు మొండేటి (Chandoo Mondeti) కూడా ఇదే విషయాన్ని సరదాగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ రామాయణంలో సీతగా నటిస్తున్నా, తెలుగులో మాత్రం కొత్త ప్రాజెక్టు ఏదీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, టాలీవుడ్‌లో ఇప్పుడు ఆమె పేరు గట్టిగానే వినిపిస్తోంది. అల్లు అర్జున్‌తో (Allu Arjun) త్రివిక్రమ్  (Trivikram)   రూపొందించబోయే పాన్ ఇండియా సినిమా కోసం ఆమె పేరు చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

Trivikram

ఈ కాంబినేషన్ సినిమాలో మైథలాజికల్ టచ్‌ ఉంటుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు బాగా డెప్త్‌ ఉంటుందని సమాచారం. ఈ రోల్‌కి ఎవరు అయితే బాగా సరిపోతారో త్రివిక్రమ్ చాలా ఆలోచించాడట. చివరికి తన దృష్టి సాయి పల్లవిపై పడిందట. ఇందులో హీరోయిన్ పాత్ర యారోగెంట్‌గా ఉంటుందని, స్ట్రాంగ్‌ పర్సనాలిటీతో ఆకట్టుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు టాక్‌. ఆ కారణంగా ఈ రోల్‌కి సాయి పల్లవిని సంప్రదించాలని నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Can Trivikram convince that actress

త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలు సహజంగా డీసెంట్‌గానే ఉంటాయి. కథలో సెట్‌ అయ్యేలా, వెయిట్ ఉన్న రోల్స్‌ డిజైన్‌ చేస్తారు. అలాంటి దర్శకుడి సినిమాలో సాయి పల్లవి నటిస్తే, అది పెద్ద హిట్ అవ్వొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఆమె పాత్రకు ఎమోషన్‌ ఎక్కువగా ఉంటే తప్పకుండా నటనతో ఒదిగిపోతుంది. ముఖ్యంగా మైథలాజికల్ కాన్సెప్ట్‌కి ఆమె రఫ్‌ లుక్, నేచురల్‌ యాక్టింగ్ ప్లస్ అవ్వొచ్చు. సాయి పల్లవిని ఒప్పించడం సాధారణ విషయం కాదు.

Can Trivikram convince that actress

కానీ, త్రివిక్రమ్ స్టోరీ నేరేషన్‌ అద్భుతంగా చెప్పగల దర్శకుడు. ఒకసారి కథ వినగానే, పాత్రపై పర్ఫెక్ట్ క్లారిటీ ఇస్తాడని తెలిసినవారంతా అంటారు. కాబట్టి, తన నేరేషన్‌తో సాయి పల్లవిని సంతకం చేయించగల సత్తా గురూజీకి తప్పకుండా ఉంది. ఒకవేళ ఈ కాంబినేషన్ లైన్‌లోకి వస్తే, అది టాలీవుడ్‌కి ఓ భారీ హిట్ సినిమాగా నిలిచే ఛాన్స్ ఉంది.

‘ఛావా’.. చాలా బాగా క్యాష్ చేసుకుంది..!

This is the most recent post.
Older Post

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.