
ఈ ఏడాది ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు మరణించారు. ఎస్.కె.ఎన్ (Sreenivasa Kumar Naidu) తండ్రి , ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్,సీనియర్ హీరో వేణు (Venu Thottempudi) తండ్రి, అలాగే దర్శకుడు వెట్రి దురై, సింగర్ విజయలక్ష్మి అలియాస్ మల్లికా రాజ్ పుత్,’దంగల్’ నటి అయిన సుహానీ భట్నాగర్, ప్రముఖ రచయిత కమ్ నిర్మాత అయిన వి.మహేశ్, దర్శకుడు చిదుగు రవిగౌడ్, ‘మొగలిరేకులు’ ఫేమ్ పవిత్ర నాథ్,దర్శకుడు కమ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన సూర్య కిరణ్ (Surya Kiran), కోలీవుడ్ కమెడియన్ శేషు,డేనియల్ బాలాజీ (Daniel Balaji) , రచయిత శ్రీ రామకృష్ణ,సీనియర్ కమెడియన్ విశ్వేశ్వరరావు,బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్, నిర్మాత అయిన గంగూ రామ్ సే,తమిళ నటుడు అరుళ్మణి,పాప్ సింగర్ పార్క్ బొ రామ్,కన్నడ నిర్మాత సౌందర్య జగదీశ్ వంటి వారు మృతి చెందారు.
ఈ బ్యాడ్ న్యూస్..ల నుండి సినీ పరిశ్రమ కోలుకోకుండానే మరో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు, ఎన్టీఆర్ అవార్డు గ్రహీత అయినటువంటి ద్వారకీశ్ కన్నుమూశారు. 81 ఏళ్ళ వయసు కలిగిన ఈ సీనియర్ నటుడు గుండెపోటుతో మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
1963లో సినీ రంగ ప్రవేశం చేసిన ఈయన అనేక సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ‘ఆయుష్మాన్ భవ’ ‘ఆప్తమిత్ర’ ‘విష్ణువర్ధన’ వంటి చిత్రాల్లో ఈయన నటించడం కూడా జరిగింది. ఇక ద్వారకీష్ మృతి కన్నడ సినీ పరిశ్రమకు తీరని లోటని కొంతమంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు అభిప్రాయపడుతూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.