సీనియర్ నటి శరణ్య పై కేసు నమోదు.. ఏమైందంటే..!

కోలీవుడ్ సీనియర్ నటి శరణ్య పొన్వన్నన్ (Saranya Ponvannan) అందరికీ గుర్తుండే ఉంటుంది. తమిళ, తెలుగు.. సినిమాల్లో ఎక్కువగా తల్లి పాత్రల్లో కనిపిస్తూ ఉంటుంది ఈమె. అయితే తాజాగా ఈమెపై కేసు నమోదవ్వడం సంచలనం సృష్టిస్తుంది అనే చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. శరణ్య చెన్నైలో నివాసముంటుంది. అయితే విరుంగబాక్కంలో పార్కింగ్‌ విషయంలో ఈమె పొరుగింటి వారితో గొడవ పెట్టుకుంది అని తెలుస్తుంది. ఈ క్రమంలో శరణ్య ప్రవర్తన పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసినట్టు తెలుస్తుంది.

అంతేకాదు నటి శరణ్య తమను బెదిరించిందని కూడా వాళ్లు కంప్లయింట్లో పేర్కొంటూ శ్రీదేవి అనే మహిళ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దాంతో పోలీసులు శరణ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దీంతో ఈ టాపిక్ వైరల్ అవుతుంది. కేసు ఇంకాస్త స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయా లేదా ? అనేది తెలియాల్సి ఉంది.

ఇక శరణ్య.. ‘రఘువరన్‌ బీటెక్‌’ (Velaiilla Pattadhari) తో పాటు ‘కొమరం పులి (Komaram Puli) ‘, ‘రెడీ’ (Ready) , ’24′(24 Movie) , ‘వేదం'(Vedam) , ‘గ్యాంగ్‌ లీడర్'(Nani’s Gang Leader) , ‘మహాసముద్రం'(Maha Samudram) , ‘ఖుషి’ (Kushi) (2023) సినిమాల్లో నటించారు. అలాగే శరణ్య.. విలక్షణ నటుడు సంపత్ రాజ్ (Sampath Raj) కి మాజీ భార్య అనే సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఈ జంట .. కొన్నాళ్లు బాగానే కలిసున్నారు. కానీ కొన్నాళ్ల తర్వాత మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. అయినప్పటికీ ఇప్పటికీ ఫ్రెండ్స్ గానే ఉన్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.