
2024 లో ఎంతో మంది సినీ ప్రముఖులు మృతి చెందారు. ఎస్.కె.ఎన్ (Sreenivasa Kumar Naidu) తండ్రి , ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్,సీనియర్ హీరో వేణు (Venu Thottempudi) తండ్రి, అలాగే దర్శకుడు వెట్రి దురై, సింగర్ విజయలక్ష్మి అలియాస్ మల్లికా రాజ్ పుత్,’దంగల్’ నటి అయిన సుహానీ భట్నాగర్, ప్రముఖ రచయిత కమ్ నిర్మాత అయిన వి.మహేశ్, దర్శకుడు చిదుగు రవిగౌడ్, ‘మొగలిరేకులు’ ఫేమ్ పవిత్ర నాథ్,దర్శకుడు కమ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన సూర్య కిరణ్ (Surya Kiran), కోలీవుడ్ కమెడియన్ శేషు,డేనియల్ బాలాజీ (Daniel Balaji) ,
రచయిత శ్రీ రామకృష్ణ,సీనియర్ కమెడియన్ విశ్వేశ్వరరావు,బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్, నిర్మాత అయిన గంగూ రామ్ సే,తమిళ నటుడు అరుళ్మణి,పాప్ సింగర్ పార్క్ బొ రామ్, కన్నడ నిర్మాత, బిజినెస్మెన్ అయిన సౌందర్య జగదీష్, కమల్ హాసన్ (Kamal Haasan) మామగారు శ్రీనివాసన్ వంటి వారు మృతి చెందారు. ఈ విషాదాల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇంకో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. సినీ పరిశ్రమకు చెందిన ఓ రైటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మణికొండ, పంచవటి కాలనీలో ఉండే దాసరి లలిత సాయి అనే రైటర్ తాజాగా మృతి చెందినట్టు తెలుస్తోంది. విక్రమ్ హైట్స్ లో నివసించే అతను యానిమేషన్ స్టోరీ రైటర్ గా పనిచేసేవాడు. ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఖాళీగా ఉండటంతో.. ఖర్చుల కోసం తెలిసిన వాళ్ళ వద్ద అప్పులు చేసాడట.
అప్పుతో పాటు దానికి వడ్డీ, అలాగే అప్పు ఇచ్చిన వాళ్ళ ఒత్తిడి కూడా పెరిగిపోవడంతో అతను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడట. ఈ క్రమంలో ఓ సూసైడ్ నోట్ రాసి.. ఫ్యాన్ కి ఉరి వేసుకుని చనిపోయినట్టు రాయదుర్గం పోలీసులు వెల్లడించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని బాడీని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కి తరలించారట. లలిత సాయి ఘటన పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.