
విక్టరీ వెంకటేష్ (Venkatesh) , సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్లో వచ్చిన ఆల్ టైం క్లాసిక్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu). 2013 లో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా.. సూపర్ హిట్ గా నిలిచింది. క్లాస్ సినిమా అవ్వడం వల్ల భారీ లాభాలు అయితే రాలేదు కానీ, క్రేజీ కాంబినేషన్ కాబట్టి.. నిర్మాత, బయ్యర్స్ అంతా గట్టెక్కేశారు. తర్వాత ఈ సినిమా టీవీల్లో చూసినప్పుడు ఆడియన్స్ అంతా బాగా ఎంజాయ్ చేశారు అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. నిన్న అంటే మార్చి 7న రీ- రిలీజ్ అయ్యింది.
SVSC Collections:
అయితే ఈసారి ఫ్యాన్స్ అంతా ఈ సినిమాని ఎగబడి చూస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలని భావిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. అన్ సీజన్లో, ఓ రీ- రిలీజ్ సినిమాకి, అదీ క్లాస్ సినిమాకి ఇలాంటి ఓపెనింగ్స్ అస్సలు ఊహించలేదు అనే చెప్పాలి. ఒకసారి (SVSC) రీ- రిలీజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.96 cr |
సీడెడ్ | 0.21 cr |
ఉత్తరాంధ్ర | 0.35 cr |
ఈస్ట్ | 1.52 cr |
వెస్ట్ | 0.56 cr |
కృష్ణా | 2.08 cr |
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (SVSC) సినిమాకి రీ- రిలీజ్లో కూడా రూ.2.08 కోట్ల(గ్రాస్) వసూళ్లు వచ్చాయి. రెండో రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. చూస్తుంటే.. ఈ వీకెండ్ మొత్తం ఈ సినిమా క్యాష్ చేసుకునేలా కనిపిస్తుంది. ఇది మామూలు విషయం కాదు అనే చెప్పాలి.