మా స్నేహాన్ని అర్థం చేసుకోలేరు… స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌!

సినిమా ఇండస్ట్రీలో ట్రోలింగ్‌ బారిన ఎక్కువగా పడే హీరోయిన్ల లిస్ట్‌ రాస్తే… టాప్‌లో ఉండే హీరోయిన్లలో అనన్య పాండే (Ananya Panday) ఒకరు. నటన విషయంలో, ఫిగర్‌ విషయంలో, అవకాశాల విషయంలో ఆమె ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది. వారసత్వ నాయిక అంటూ ఆమెను తెగ ఏడిపిస్తుంటారు నెటిజన్లు. గతంలో ఈ విషయంలో చాలాసార్లు స్పందించిన ఆమె… మరోసారి రియాక్ట్ అయింది. అలాగే ఇండస్ట్రీలో స్నేహాల గురించి కూడా మాట్లాడింది. ఇప్పుడు ఆ విషయాలు వైరల్‌గా మారాయి.

చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు అని కామెంట్‌ చేసిన అనన్య పాండే కలసి పనిచేస్తున్నప్పుడు స్నేహితులను చేసుకోకూడదని ఏ ఒక్క నటి అనుకోదని చెప్పింది. సినిమా పరిశ్రమలో హీరోయిన్లు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారని, దానికి తానే ప్రత్యక్ష సాక్షినని చెప్పింది అనన్య. ఇండస్ట్రీలో తనకు మంచి స్నేహితులున్నారని, మా మధ్య ఉన్న బాండింగ్‌ను బయటివాళ్లు చూడలేరని అంది.

ఇండస్ట్రీలో మంచి స్నేహపూర్వక వాతావరణం ఉంది కాబట్టే… తన చిన్నపాటి కెరీర్‌లోనే దీపికా పడుకొణె (Deepika Padukone), భూమి పెడ్నేకర్‌ (Bhumi Pednekar) లాంటి హీరోయిన్లతో నటించగలిగాను అని అంటోంది. ఈ విషయంలోనే తనను ఎంతోమందిమంది ట్రోల్స్‌ చేశారని, అయితే తనను ఎప్పుడూ ఆ మాటలు ప్రభావితం చేయలేదు అని క్లారిటీ ఇచ్చింది. దీంతో ట్రోలర్స్‌కి ఈ విషయంలో పూర్తి క్లారిటీ ఇచ్చినట్లు అయింది. మరి ఈ మాటల మీద ఎలాంటి ట్రోల్స్‌ వస్తాయో చూడాలి.

25 ఏళ్ల అనన్య పాండే సినిమాల సంగతి చూస్తే… ప్రస్తుతం ‘కంట్రోల్‌’, ‘శంకర’ సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. తొలి సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్‌ దశలో ఉండగా… రెండో సినిమా షూటింగ్‌ దశలో ఉంది. తెలుగులో ఆమె నుండి వచ్చిన ఏకైక చిత్రం ‘లైగర్‌’ (Liger) . ఆ సినిమా తర్వాత కుర్ర హీరోల సరసన ఈమెనే ఎక్కువగా పరిశీలిస్తారు అనుకున్నా.. ఆ సినిమా ఫలితం తేడా కొట్టేసరికి మళ్లీ ఇటువైపు రాలేదు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.