March 17, 202506:03:31 PM

తారక్‌ – హృతిక్‌ కోసం హాలీవుడ్‌ యాక్షన్‌… ఎవరొస్తున్నారు అంటే?

‘వార్‌ 2’ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఏదో పుకారు వస్తూనే ఉంది. తారక్‌ ఆ సినిమా సెట్స్‌కి వెళ్లేంతవరకు, షూట్‌లో పాల్గొన్నంతవరకు ఆయన ఎంట్రీ మీద కూడా ఏవో ఒక పుకార్లు వచ్చాయి. అయితే పుకార్లు పక్కా వార్తలుగా ఇప్పుడు మారిపోయాయి. అయితే ఇప్పుడు సినిమా కాస్టింగ్‌, క్రూ గురించి పుకార్లు స్టార్ట్‌ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం హాలీవుడ్‌ స్టంట్ డైరెక్టర్‌ పని చేస్తున్నారని చెబుతున్నారు.

అమెరికన్ యాక్షన్ డైరెక్టర్ స్పిరో రాజటోస్ ఈ సినిమా టీమ్‌తో ఇటీవల జాయిన్ అయ్యారని తెలుస్తోంది. ఈ సినిమా యాక్షన్‌ సన్నివేశాలను ఆయనే డిజైన్ చేస్తున్నారని చెబుతున్నారు. హాలీవుడ్‌ స్థాయిలో సినిమాను తెరకెక్కించే క్రమంలో ఆయన వర్క్‌ బాగా ఉపయోగపడుతుంది అని టీమ్‌ నమ్ముతోంది. ఇప్పటికే యాక్షన్‌ సీన్స్‌ కోసం ఇటు తారక్‌ (Jr NTR) , అటు హృతిక్ (Hrithik Roshan) ఆ సీన్స్‌ కోసం శిక్షణ కూడా తీసుకుంటున్నారట. త్వరలో షూటింగ్‌ ప్రారంభమవుతుందట.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటిస్తున్న ‘వార్ 2’ సినిమా షూటింగ్‌ ఇప్పుడు శరవేగంగా సాగుతోంది. ఆగస్టు 14, 2025న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది చిత్రబృందం. ఈ సినిమా మొదటి భాగానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడంతో ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు తారక్‌ కూడా సినిమాలో యాడ్‌ అవ్వడంతో ఇంకాస్త పెద్ద సినిమా అయింది.

‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అద్వానీ (Kiara Advani) ఓ కథానాయికగా ఎంపికైంది. తారక్ సరసన ‘యానిమల్’ (Animal) త్రిప్తి డిమ్రి (Tripti Dimri) కనిపించనుందని మరో భోగట్టా. అయితే హీరోల విషయంలో ఇన్నాళ్లూ స్పష్టత లేనట్లే హీరోయిన్ల విషయంలోనూ క్లారిటీ లేదు. త్వరలో వీళ్ల ఎంట్రీ సెట్స్‌లోకి ఉంటుంది అని చెబుతున్నారు. ఇక ఈ సినిమాతో ‘వార్‌ ’ ఫ్రాంచైజీని హాలీవుడ్‌ స్థాయికి పంపాలనేది నిర్మాత ఆదిత్య చోప్పా ఆలోచన.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.