March 20, 202501:20:23 PM

Devara: దేవర సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ అలాంటి రోల్ లో కనిపిస్తారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) దేవర (Devara) సినిమా మొదట ప్రకటించిన డేట్ ప్రకారం ఏప్రిల్ నెల 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా ఈ సినిమా ఆ తేదీకి రిలీజ్ కావడం లేదనే సంగతి తెలిసిందే. దేవర సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండగా ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ కూడా (Siddhu Jonnalagadda) గెస్ట్ రోల్ లో కనిపిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. కథను మలుపు తిప్పే పాత్రలో సిద్ధు కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

అధికారిక ప్రకటన వస్తే మాత్రమే ఈ వార్తలను నమ్మాల్సి ఉంటుంది. సిద్ధు జొన్నలగడ్డ సోషల్ మీడియాలో త్వరలో సర్ప్రైజ్ ఉండబోతుందనే అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టడంతో ఈ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే కొరటాల శివ (Kortala Siva) లేదా ఎన్టీఆర రాబోయే రోజుల్లో ఈ వార్తలకు సంబంధించి స్పష్టత ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం అందుతుండటం గమనార్హం.

దేవర సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఒక హీరోయిన్ గా నటిస్తుండగా మరాఠీ బ్యూటీ శృతి మరాఠే మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. దేవర సినిమా సముద్రతీరం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడం ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడానికి కారణమవుతోంది. యాక్షన్ సీన్స్ తో పాటు మాస్ ప్రేక్షకులకు సైతం నచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండటం గమనార్హం. ఐదు భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతుండటం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. దేవర ఫస్ట్ పార్ట్ సక్సెస్ సాధిస్తే సెకండ్ పార్ట్ పై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. దేవర సినిమాలో సాంగ్స్ సైతం స్పెషల్ గా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. దేవర సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను మెప్పించేలా ఉండనుందని తెలుస్తోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.