March 22, 202507:21:21 AM

Hanu Raghavapudi: ‘సీతా రామం’ దర్శకుడితో ప్రభాస్ సినిమా.. హను ఓపెన్ అయిపోయాడుగా..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గతేడాది ‘ఆదిపురుష్’ ‘సలార్’ వంటి చిత్రాలతో సందడి చేశాడు. ఇందులో ‘ఆదిపురుష్’ (Adipurush) ఆడలేదు కానీ ‘సలార్’ (Salaar) బాగానే ఆడింది. త్వరలో ‘కల్కి 2898’ (Kalki 2898 AD)  తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రభాస్ (Prabhas) . నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్ (C. Aswani Dutt) నిర్మిస్తున్నారు. దీని తర్వాత ప్రభాస్… మారుతి దర్శకత్వంలో చేస్తున్న ‘రాజా సాబ్’ తో ప్రేక్షకుల ముందుకు వస్తాడు.

ఆ తర్వాత చేయబోయే సినిమాలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ‘సలార్ పార్ట్ 2’ షూటింగ్ ను ప్రభాస్ కంప్లీట్ చేయాల్సి ఉంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga), హను రాఘవపూడి (Hanu Raghavapudi)  వంటి స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సందీప్ రెడ్డి వంగాతో సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమైంది. అయితే హను రాఘవపూడితో సినిమా ఇంకా అధికారికంగా ప్రకటించింది లేదు. అయితే తాజాగా దర్శకుడు హను రాఘవపూడి ఓ కార్యక్రమంలో హాజరయ్యి ‘తన నెక్స్ట్ సినిమా ప్రభాస్ తోనే’ అంటూ కన్ఫర్మ్ చేసేశాడు.

అంతేకాదు ఈ ప్రాజెక్టుని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించబోతోందని స్పష్టంచేశాడు. ఇక్కడి వరకు ఓకే కానీ..’ఈ ప్రాజెక్టుకి విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrasekhar)  సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడని.. అప్పుడే 3 పాటలు కూడా ఫైనల్ చేసేసినట్టు’ ఈ సందర్భంగా హను క్లారిటీ ఇచ్చేశాడు. అనౌన్స్మెంట్ కూడా రాకుండానే హను ఇంత ఫాస్ట్ గా ఉండటంతో ఇండస్ట్రీకి చెందిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.