March 21, 202512:31:42 AM

Jagapathi Babu: నేను పేదవాడిని.. జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జగపతిబాబు (Jagapathi Babu) సత్తా చాటారు. ప్రతి సినిమాలో భిన్నమైన పాత్రలో నటిస్తూ జగపతిబాబు ప్రశంసలు అందుకున్నారు. జగపతిబాబు రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. జగపతిబాబు పారితోషికం పరంగా కూడా టాప్ లో ఉన్నారు. అయితే జగపతిబాబు తాజాగా ఒక సందర్భంలో చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాకు చిన్న సినిమాలు చేయాలని కోరిక ఉందని చిన్న సినిమాలు కొత్తగా ఉంటున్నాయని ఆయన అన్నారు.

ఇక్కడ నా బ్యాడ్ లక్ ఏంటంటె నేను డబ్బున్న పేదవాడినని నా చేతిలో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయని ఆ సినిమాల షూటింగ్ లు పోస్ట్ పోన్ అవుతూనే ఉంటాయని జగపతిబాబు వెల్లడించారు. ఆ సినిమాలు చేతిలో ఉండటం వల్ల వేరే ఆఫర్లు రావడం లేదని ఆయన పేర్కొన్నారు. నేను పెద్ద సినిమాలు చేస్తున్నానని నేను చాలా ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నానని అనుకుంటున్నారని జగపతిబాబు వెల్లడించారు.

పెద్ద సినిమాల వాయిదాల వల్ల నాకున్న సినిమాలలో అవకాశాలు రావడం లేదని ఆయన అన్నారు. గతంలో రెండు మూడుసార్లు నా పని అయిపోయిందని అనుకున్నానని జగపతిబాబు పేర్కొన్నారు. అది కూడా లెజెండ్ సినిమాకు ముందు అని ఆయన అన్నారు. కానీ నేను మళ్లీ వచ్చానని మీ జగపతిబాబు ఎక్కడికీ పోడని వెళ్లినట్లు వెళ్తాడని మళ్లీ వస్తూనే ఉంటాడని జగపతిబాబు చెప్పుకొచ్చారు. జగపతిబాబును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ఇతర భాషల్లో సైతం జగపతిబాబుకు ఆఫర్లు వస్తున్నాయి. జగపతిబాబు రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. జగపతిబాబును రిపీట్ చేయడానికి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. సుకుమార్ (Sukumar) సినిమాలలో జగపతిబాబుకు ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి. ఈ ఏడాది జగపతిబాబు కెరీర్ పరంగా మరింత బిజీ అవుతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సలార్2 (Salaar) సినిమాలో జగపతిబాబు పాత్రకు మరింత ఎక్కువ ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.