March 20, 202509:51:22 PM

Jai Hanu Man: ప్రీ లుక్ పోస్టర్ తో అంచనాలు పెంచేసిన ప్రశాంత్.. ఆ క్లారిటీ ఎప్పుడిస్తారో?

తేజ సజ్జా (Teja Sajja)  ప్రశాంత్ వర్మ (Prashanth Varma)  కాంబినేషన్ లో తెరకెక్కిన హనుమాన్ (Hanu Man)  మూవీ సంచలన విజయాన్ని సొంతం చేసుకోగా హనుమాన్ సీక్వెల్ గా తెరకెక్కుతున్న జై హనుమాన్ మూవీ నుంచి శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్రీ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ ప్రీ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. శ్రీరామునికి హనుమంతుడు ప్రమాణం చేస్తున్నట్టుగా ప్రశాంత్ వర్మ పోస్టర్ వదలడం గమనార్హం. అదే సమయంలో ప్రశాంత్ వర్మ శ్రీరామనవమి పండుగ సందర్భంగా శ్రీరాముని ఆశీస్సులతో ఇదే నా ప్రమాణం అని జై హనుమాన్ సినిమాతో ప్రపంచ సినీ ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని అనుభూతిని అందిస్తానని తెలిపారు.

జై హనుమాన్ సినిమాను లైఫ్ టైం సెలబ్రేట్ చేసుకునే సినిమాగా తీర్చిదిద్దుతానని ప్రశాంత్ వర్మ వెల్లడించడం గమనార్హం. ప్రశాంత్ వర్మ చేసిన కామెంట్లు జై హనుమాన్ సినిమా కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు మరింత సంతోషాన్ని కలిగించాయి. జై హనుమాన్ మూవీలో నటించే స్టార్ హీరోల గురించి ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జై హనుమాన్ మూవీకి బడ్జెట్ పరంగా కూడా ఎలాంటి లిమిట్స్ లేవు.

200 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జై హనుమాన్ మూవీ ఫ్యాన్స్ అంచనాలను మించి ఉండబోతుందని తెలుస్తోంది. షూటింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావడం సులువు కాదు.

ప్రశాంత్ వర్మ సినిమా క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదు. జై హనుమాన్ పాన్ ఇండియా మూవీగా అన్ని భాషల్లో విడుదల కానుందని సమాచారం అందుతోంది. జై హనుమాన్ సినిమా గురించి రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.