Janhvi Kapoor: జాన్వీ మాట్లాడకపోతే… బోనీ ఆయనతోనే మాట్లేడేవాడట!

బాలీవుడ్‌ బ్యూటీ దివా జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor)  ప్రేమలో ఉందా? ప్రేమికుడు ఎవరు? అంటూ గత కొన్ని నెలలుగా రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనికి ఆన్సర్‌ దాదాపుగా తెలిసినా.. క్లారిటీ అయితే రావడం లేదు. ఆ మధ్య ఓ టీవీ కార్యక్రమంలో జాన్వీ మాట్లాడుతూ ‘నా స్పీడ్‌ డయల్‌ లిస్ట్‌లో శిఖర్‌ పహారియా’ నెంబరు కూడా ఉంటుంది అంటూ చిన్న క్లారిటీ ఇచ్చింది. అయితే ప్రాణ స్నేహితుడు అనే యాంగిల్‌లో మాట్లాడింది. ఇద్దరూ కలసి తిరిగే ట్రిప్పులు, ఔటింగ్‌ల చూస్తే అర్థమైపోతుంది అనుకోండి.

అయితే, తాజాగా జాన్వీ తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ (Boney Kapoor) చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు శిఖర్‌ తన అల్లుడు అని ఒప్పేసుకున్నట్లే అనిపిస్తోంది. జాన్వీ, శిఖర్‌ గాఢమైన ప్రేమలో ఉన్నారని, భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటారని మీడియాలో వస్తున్న వార్తలపై తాజాగా బోనీ కపూర్ స్పందించారు. శిఖర్ తమ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడని, తమ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా ముందుంటాడని బోనీ కపూర్‌ చెప్పుకొచ్చాడు. జాన్వీతో చిన్నపాటి గొడవలు వచ్చినప్పుడు, తనకు మాటలు లేనప్పుడు శిఖర్‌తో టచ్‌లో ఉంటానని చెప్పారు.

శిఖర్‌ అంత మంచి కుర్రాడని కితాబు ఇచ్చిన బోనీ… అంతకుమించి రిలేషన్ గురించి ఏమీ మాట్లాడలేదు. దీంతో శిఖర్‌ తన అల్లుడు అయినట్లే అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ కనిపిస్తున్నాయి. ఇక లండన్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన శిఖర్ పహారియాకు సొంతంగా ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్ కంపెనీ ఉంది. సోదరుడితో కలసి వివిధ వ్యాపారాలు చేస్తున్నాడు. ఇక జాన్వీ సినిమా కెరీర్‌ గురించి చూస్తే… అందులోనూ టాలీవుడ్‌ సినిమాలు చూస్తే ప్రస్తుతం ఎన్టీఆర్‌తో (Jr NTR) ‘దేవర’ (Devara) సినిమాలో నటిస్తంది.

ఇది కాకుండా రామ్‌చరణ్‌(Ram Charan)  – బుచ్చిబాబు సానాల  (Buchi Babu Sana) ‘పెద్ది’  (RC16/Peddi)  (ప్రచారంలో ఉన్న టైటిల్‌)లో కూడా ఆమెనే నాయిక. ఈ రెండే కాక మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి అంటున్నారు. మొన్నీమధ్య వరకు ‘పుష్ప: ది రూల్‌’లో  (Pushpa 2)  ప్రత్యేక గీతం కోసం ఆమెను సంప్రదించారు అనే టాక్‌ కూడా నడిచింది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.