
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా తెరకెక్కుతున్న ‘దేవర: పార్ట్ 1 ‘ (Devara) ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. మరోపక్క ‘వార్ 2 ‘ షూటింగ్లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యాడు. అందుకోసం ఇటీవల ముంబై వెళ్ళాడు. ‘వార్ 2 ‘ లో హృతిక్ రోషన్‌తో కలసి ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ‘బ్రహ్మాస్త్ర’ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ఎన్టీఆర్ తన భార్యతో కలిసి ఓ ప్రైవేట్ పార్టీకి వెళ్ళాడు.
బాంద్రాలోని ఓ రెస్టారెంట్‌లో ఈ పార్టీ జరిగింది. ఎన్టీఆర్ – ప్రణతి తో పాటు రణబీర్ (Ranbir Kapoor) -అలియా భట్ (Alia Bhatt), హృతిక్ రోషన్ (Hrithik Roshan) , కరణ్ జోహార్ (Karan Johar) వంటి స్టార్లు కూడా ఈ పార్టీకి హాజరయ్యారు. చూస్తుంటే.. ఎన్టీఆర్ త్వరగానే బాలీవుడ్ కల్చర్ ని అలవాటు చేసుకున్నట్టు కనిపిస్తుంది. అక్కడి మీడియాతో ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని కూడా ఎన్టీఆర్ బాగానే గ్రహించాడు అని స్పష్టమవుతుంది.
ఇక డిన్నర్ ముగించుకుని బయటకు వచ్చిన ఎన్టీఆర్ ని ఫోటోగ్రాఫర్లు, ఫ్యాన్స్ చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఓ లేడీ ఫ్యాన్ ఎన్టీఆర్‌ను సెల్ఫీ అడిగింది. అదే టైములో కొంతమంది కుర్రాళ్ళు దూసుకొచ్చారు. వారు అలా రావడంతో ఎన్టీఆర్ భార్య ప్రణతికి కొంచెం ఇబ్బంది ఎదురైంది. దీంతో ఫోటో ఇవ్వడం కుదరదు అని ఎన్టీఆర్ అన్నట్టు తెలుస్తుంది.
అయితే ఆ తర్వాత కూల్ అయ్యి.. పిలిచి ఫోటో ఇచ్చారట. పబ్లిక్ ఈవెంట్స్ లో స్టార్స్ కి ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వడం తరచూ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఎన్టీఆర్ కి నార్త్ లో కూడా ఓ రేంజ్ ఫ్యాన్ బేస్ ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి
View this post on Instagram