March 28, 202503:26:12 AM

Mahesh Babu,Manjula: అక్కతో కలిసి మహేష్ బాబు అల్లరి.. క్యూట్ వీడియో వైరల్.!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)  త్వరలో రాజమౌళి (S. S. Rajamouli)  దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం దీని కోసం అతను కసరత్తులు చేస్తున్నాడు. ఆల్రెడీ లాంగ్ హెయిర్ తో అతను కొత్త లుక్ లోకి మారిపోయాడు. అంతేకాదు బాడీని ఇంకా పెంచాలని డిసైడ్ అయ్యి జిమ్ లో ట్రైనర్ ను పెట్టుకుని కసరత్తులు చేస్తున్నాడు. మే 31 న కృష్ణ (Krishna) గారి పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు 29 వ సినిమా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. తాజాగా మహేష్ బాబు హైదరాబాద్ లో జరిగిన బంధువుల పెళ్ళికి హాజరయ్యాడు. మహేష్ బాబు మాత్రమే కాదు నమ్రత (Namrata) , సితార.. అలాగే సుధీర్ బాబు అతని భార్య, మహేష్ బాబు అక్క మంజుల వంటి వారు కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. మరోపక్క టాలీవుడ్ కి చెందిన కొందరు సినీ ప్రముఖులు కూడా ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. ఈ క్రమంలో ఓ క్యూట్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది.

మహేష్ బాబు కారు నుండి దిగి లోపలికి రాగానే అక్కడ మరింత సందడి వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో అతని చిన్నక్క మంజుల (Manjula Ghattamaneni)  వచ్చి మహేష్ జుట్టు పై చెయ్యి వేసి.. ‘ఏంట్రా ఇంత జుట్టు పెంచావ్’ అంటూ కామెంట్ చేసింది. దీనికి మహేష్ సరదాగా నవ్వుకుని అక్కపై తనదైన సెటైర్ వేసి సంభాషించాడు. దీంతో అక్కడి వారందరి మొహాల్లో చిరు నవ్వులు కురిసాయి అని చెప్పాలి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.