March 22, 202507:50:39 AM

Kona Venkat, Jr NTR: ఎన్టీఆర్ ఒప్పుకునేవరకు నిరాహార దీక్ష.. కోన కామెంట్స్ వైరల్!

హీరోగా పోషించిన ప్రతి పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలంటే ఎంతో ప్రతిభ ఉండాలి. అలాంటి ప్రతిభ ఉన్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  ఒకరు. వి.వి.వినాయక్ (V. V. Vinayak) డైరెక్షన్ లో తెరకెక్కిన అదుర్స్ (Adhurs) సినిమాలో నరసింహ, నరసింహాచారి పాత్రలలో నటించిన ఎన్టీఆర్ ఆ రెండు పాత్రలలో అదరగొట్టారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ రావాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు.

అదుర్స్ సీక్వెల్ గురించి కోన వెంకట్ (Kona Venkat) స్పందిస్తూ ఎన్టీఆర్ ఇంటిముందు నిరాహార దీక్ష చేసైనా ఈ సినిమాకు ఒప్పిస్తానని అన్నారు. అదుర్స్ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గీతాంజలి మళ్లీ వచ్చింది ( Geethanjali Malli Vachindi) మూవీ ఈవెంట్ లో భాగంగా అదుర్స్2 గురించి కోన వెంకట్ ఇచ్చిన అప్ డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. అదుర్స్2 సినిమాను పక్కాగా చేయాలని అనుకుంటున్నానని కోన వెంకట్ తెలిపారు.

ఎప్పటికైనా అదుర్స్2 సినిమాను తెరకెక్కిస్తానని ఆయన కామెంట్లు చేశారు. అవసరమైతే తారక్ ఇంటి ముందు ధర్నా చేసి ఒప్పిస్తానని ఆయన కామెంట్లు చేశారు. చారి పాత్రలో తారక్ తప్ప మరెవరూ చేయలేరని అదుర్స్ మూవీ ఎన్టీఆర్ కెరీర్ లో బెస్ట్ మూవీ అని కోన వెంకట్ వెల్లడించారు. చారి పాత్ర క్యారెక్టర్, ఆహార్యం, మాడ్యులేషన్ ఎన్టీఆర్ లా చేసేవాళ్లు ఇండియాలోనే లేరని ఆయన అన్నారు.

కోన వెంకట్ చేసిన కామెంట్లతో అదుర్స్2 సినిమాపై ఫ్యాన్స్ లో అశలు పెరగగా ఈ సినిమా తెరకెక్కడం సులువైతే కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దేవర (Devara) ప్రమోషన్స్ లో భాగంగా తారక్ అదుర్స్2 గురించి స్పందించే ఛాన్స్ అయితే ఉందని నెటిజన్లు వెల్లడిస్తున్నారు. అదుర్స్2 సినిమా తెరకెక్కినా పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాను తెరకెక్కించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.