March 21, 202502:22:43 AM

Mahesh Babu, Trivikram: త్రివిక్రమ్ తో పాటు మహేష్ కి కూడా చాలా స్పెషల్!

త్రివిక్రమ్ శ్రీనివాస్ కి (Trivikram) టాలీవుడ్ హీరోల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే.. టక్కున పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , మహేష్ బాబు (Mahesh Babu)… ల పేర్లే అందరికీ గుర్తొస్తాయి. పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్..ల బాండింగ్ అందరికీ తెలిసిందే. అలాగే త్రివిక్రమ్- మహేష్ బాబు..ల బాండింగ్ కూడా అలాంటిదే. ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) టైంలో మహేష్ బాబు.. త్రివిక్రమ్ గురించి చెప్పిన మాటలు కూడా అందరికీ గుర్తుండే ఉంటాయి. ‘త్రివిక్రమ్ కి థాంక్స్ చెప్పడం కొత్తగా ఉంటుందని.. అతను తన ఫ్యామిలీ మెంబర్ లాంటి వారని’ మహేష్ స్పీచ్ లో భాగంగా తెలియజేశారు.

అయితే ఈ 2024 త్రివిక్రమ్- మహేష్..లకి చాలా స్పెషల్. ఎందుకంటే.. మహేష్- త్రివిక్రమ్..ల కెరీర్ మొదలైంది. 1999 లో..! ‘స్వయంవరం’ తో త్రివిక్రమ్ రైటర్ గా ఎంట్రీ ఇచ్చారు. 1999 ఏప్రిల్ 22న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అంటే నిన్నటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 25 ఏళ్ళు అయ్యింది. ఇంకోరకంగా త్రివిక్రమ్ కెరీర్ మొదలయ్యి కూడా 25 ఏళ్ళు పూర్తయ్యిందని చెప్పవచ్చు.

అలాగే మహేష్ బాబు కూడా హీరోగా తన కెరీర్ ను మొదలు పెట్టింది 1999 లోనే..! కె.రాఘవేంద్రరావు (Raghavendra Rao) గారి దర్శకత్వంలో రూపొందిన ‘రాజకుమారుడు’ (Rajakumarudu) సినిమా 1999 లో జూలై 30న రిలీజ్ అయ్యింది. సో ఈ ఏడాదితో మహేష్ బాబు కూడా 25 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నాడు. అందుకే ఈ స్నేహితులిద్దరికీ ఈ 2024 బాగా స్పెషల్.

ఇదే ఏడాది ఆరంభంలో వీరి కాంబినేషన్లో రూపొందిన ‘గుంటూరు కారం’ సినిమా రిలీజ్ అయ్యింది. అది అనుకున్నంత హిట్ అవ్వలేదు కానీ.. భవిష్యత్తులో వీరి కాంబినేషన్లో పాన్ ఇండియా సినిమా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.