March 21, 202512:31:26 AM

Manamey Teaser: మనమే టీజర్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్.. శర్వా హిట్ సాధిస్తారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో ఒకరైన శర్వానంద్ (Sharwanand) వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శర్వానంద్, కృతిశెట్టి (Kriti Shetty) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మనమే (Manamey) సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లో డైలాగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. శ్రీరామ్ ఆదిత్య  (Sriram Aditya) అద్భుతమైన కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీజర్ అద్భుతంగా ఉందని ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

“ఇద్దరిలో ఒకరే ఏడవండి” అంటూ టీజర్ క్లైమాక్స్ లో శర్వానంద్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. శర్వానంద్ కామెడీ టైమింగ్ కు సూట్ అయ్యే సినిమా ఇదేనంటూ మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. శర్వానంద్ కెరీర్ కు ప్రస్తుత పరిస్థితుల్లో భారీ హిట్ అవసరం అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆ లోటును తీర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హేషమ్ అబ్దుల్ వాహెబ్ (Abdul Hesham Wahab) ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. శర్వానంద్ 35వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కింది.

ఖుషి (Kushi) , హాయ్ నాన్న (Hi Nanna) సినిమాలతో హేషమ్ అబ్దుల్ వాహెబ్ కు తెలుగులో మంచి పేరు వచ్చింది. తర్వాత సినిమాలతో ఆ మంచి పేరు మరింత పెరుగుతుందని ఆయన భావిస్తున్నారు. శర్వా35 ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కినట్టు తెలుస్తోంది. సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుండగా త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అదికారిక ప్రకటన రానుంది.

శర్వానంద్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఎమోషన్స్ కు పెద్ద పీట వేశారని టీజర్ చూస్తే అర్థమవుతోంది. శర్వానంద్ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.