March 20, 202510:34:22 PM

Manchu Manoj: పండంటి బిడ్డకి జన్మనిచ్చిన మనోజ్ భార్య

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) చిన్న కొడుకు మంచు మనోజ్ (Manchu Manoj) అందరికీ సుపరిచితమే. చైల్డ్ ఆరిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇతను కొన్నాళ్ల తర్వాత ‘దొంగ దొంగది’ (Donga Dongadi) తో ఫుల్ లెంగ్త్ హీరోగా మారాడు. ‘పోటుగాడు’ (Potugadu) ‘బిందాస్’ (Bindaas) ‘వేదం’ (Vedam) ‘ఝుమ్మంది నాదం’ (Jhummandi Naadam) వంటి కమర్షియల్ హిట్స్ ఇతని ఖాతాలో ఉన్నాయి. అనేక సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా ఇచ్చాడు. ఇక ఇతని పర్సనల్ లైఫ్ కూడా అందరికీ తెలిసిందే. గతంలో ఇతని ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని తర్వాత కొన్ని మనస్పర్థల వల్ల విడిపోయాడు.

గతేడాది భూమా మౌనికని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం ఆ ఫోటోలను మనోజ్ షేర్ చేయడం వంటివి మనం చూస్తూనే వచ్చాము. తాజాగా మంచు మనోజ్ తండ్రయ్యాడు. అతని భార్య భూమా మౌనిక పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మనోజ్ అక్క లక్ష్మీ మంచు (Manchu Lakshmi), భూమా మౌనిక తమ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అందులో భూమా మౌనిక.. ” ఇప్పుడు మేము నలుగురం అయ్యాం. ఎంతో మంది దేవుళ్ల ఆశీర్వాదంతో మా ఇంటికి దేవత వచ్చింది.

మేము ఎంతగానో ఎదురు చూస్తున్న బేబీ వచ్చేసింది.అన్న అయినందుకు ధైరవ్ ఆనందానికి హద్దుల్లేవు. ఆమెను మేము ముద్దుగా ఎం ఎం పులి (మనోజ్, మౌనిక) అని పిలస్తున్నాము. మా కుటుంబంపై ఆ శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి’ అంటూ AIతో చేసిన ఓ పోస్టర్ ను షేర్ చేశారు. ఇందులో పులి ఒడిలో పడుకున్న పాప కనిపిస్తుంది.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. అభిమానులు మంచు మనోజ్, మౌనిక దంపతులకి కంగ్రాట్స్ అంటూ చెప్పుకొస్తున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.