Nabha Natesh: ఇన్నాళ్లకు ఛాన్స్‌లు.. ఒకేసారి మూడు సినిమాలతో నభా నటేశ్‌ హవా!

టాలీవుడ్‌లో హీరోయిన్లకు ఛాన్స్‌ దొరకడం చాలా కష్టం. అలా దొరికిన అవకాశాన్ని నిలుపుకోకపోతే ఏమీ చేయలేం. ఇక్కడ సెకండ్‌ ఇన్నింగ్స్ అనేది హీరోయిన్ల విషయంలో చాలా కష్టం. తొలి ఇన్నింగ్స్‌లో ప్రమాదవశాత్తు అనుకోకుండా ఔటైపోయిన ఓ యంగ్‌ హీరోయిన్‌ ఇప్పుడు సెకండ్‌ ఇన్సింగ్స్‌కు రెడీ అయింది. నిజానికి చాలా నెలలుగా ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలించి ఏకంగా మూడు సినిమాల్లో నటిస్తోంది. మేం చెప్పింది నభా నటేశ్ (Nabha Natesh) గురించే అని మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో (iSmart Shankar) తెలుగు సినిమాలకు పరిచయమైన నభా నటేశ్‌.. స్లిమ్‌ బ్యూటీగా మంచి ఆదరణ సంపాదించుకుంది. ఆ సినిమా విజయం, పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) హీరోయిన్‌ అనే బ్రాండింగ్ ఆమెకు వరుస అవకాశాలు ఇచ్చాయి. అనుకున్నట్లుగా ఆ సినిమాల్లో అలరించినా.. ఆ తర్వాత అనూహ్యంగా సినిమాలకు దూరమైంది. ఏమైంది, ఎందుకు అనేది కూడా అప్పుడు తెలియలేదు. అయితే ఓ ఆరు నెలల క్రితం నభా నటేశ్‌ మళ్లీ యాక్టివ్‌ అయ్యింది.

తెలుగు సినిమాలో ఛాన్స్‌ల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఎట్టకేలకు ఇప్పుడు సినిమా ఛాన్స్‌లు రావడం ప్రారంభించాయి. ఆమె పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన సమాచారం ప్రకారం చూస్తే నభా ఇప్పుడు మూడు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి పాన్‌ ఇండియా సినిమా కాగా… మిగిలిన రెండు కూడా కాస్త పేరున్న ప్రొడక్షన్‌ హౌస్‌, హీరోలు నటిస్తున్నవే. హీరో నిఖిల్ (Nikhil) నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘స్వయంభు’ (Swayambhu) సినిమాలో నభా నటిస్తోంది.

ప్రియదర్శి (Priyadarshi) హీరోగా నటిస్తున్న సినిమాలో నభా నటేషే ఫిమేల్‌‌ లీడ్‌‌. ఇవి కాకుండా సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోందని టాక్‌. ఇప్పటికే వీళ్లిద్దరూ ‘సోలో బ్రతుకే సో బెటర్’ (Solo Brathuke So Better) అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అప్పుడు మంచి ఫలితమే వచ్చింది. ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.