NBK 109 : హీరోయిన్ ఫైనల్ అయ్యింది కానీ దుల్కర్ డిలే చేస్తున్నాడట..!

నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) తో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన బాబీ (Bobby) .. ఈసారి బాలయ్యతో అంతకు మించిన రేంజ్ యాక్షన్ మూవీ చేయడానికి రెడీ అయ్యాడు. కథ ప్రకారం ఈ సినిమాలో ఇంకో హీరోకి కూడా ఛాన్స్ ఉంది. అందుకోసం నాని(Nani) , విశ్వక్ సేన్ (Vishwak Sen) వంటి హీరోలను సంప్రదించారు ఆ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi). కానీ ఆ హీరోల నుండి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడంతో దుల్కర్ సల్మాన్ ను అప్రోచ్ అయ్యారు.

దుల్కర్ (Dulquer Salmaan) పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. కానీ ఫైనల్ చేసింది లేదు. ఇప్పటికీ బాలకృష్ణ మూవీ యూనిట్ ను హోల్డ్ లో పెట్టారు. అలా అని నో చెప్పింది లేదు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లోనే దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ అనే సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి (Venky Atluri) ఈ చిత్రానికి దర్శకుడు. అయితే ఈ సినిమా చేస్తున్న టైంలోనే నాగవంశీ అండ్ టీం దుల్కర్ ను బాలయ్య సినిమా కోసం సంప్రదించారు. కానీ ఎందుకో అతను ఇంకా ఎస్ చెప్పలేదు.

అయితే దుల్కర్ పాత్రకి జోడీని ఎంపిక చేసేసుకున్నారు.అందుతున్న సమాచారం ప్రకారం దుల్కర్ సల్మాన్ పాత్ర కోసం స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ను ఫైనల్ చేసేశారట. ఇప్పుడు దుల్కర్ నో చెబితే కనుక వేరే హీరో కోసం అన్వేషించాలి. ప్రస్తుతానికి టీం మైండ్లో అయితే దుల్కర్ తప్ప ఇంకో హీరో లేడు. ఏం జరుగుతుందో చూడాలి

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.