March 22, 202504:48:45 AM

Nayanthara: ‘కన్నప్ప’.. నయన్ ప్లేస్ లో ఆమె ఫిక్స్ అట..!

మంచు విష్ణు (Manchu Vishnu)  హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ (Kannappa) సినిమాలో ఇప్పటికే చాలా మంది స్టార్స్ ఎంపికైన సంగతి తెలిసిందనే. ప్రభాస్ (Prabhas) ఈ సినిమాలో నందీశ్వరుడి పాత్రలో కనిపించబోతున్నాడు. నయనతార (Nayanthara) పార్వతీ దేవిగా, అక్షయ్ కుమార్ (Akshay Kumar)  పరమశివుని పాత్రలో కనిపించబోతున్నట్టు కూడా గాసిప్స్ పుట్టుకొచ్చాయి. అక్షయ్ అయితే తాజాగా షూటింగ్ లో జాయిన్ అయినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే మోహన్ బాబు(Mohan Babu) , మోహన్ లాల్ (Mohanlal) , శివరాజ్ కుమార్ (Shiva Rajkumar).. వంటి స్టార్స్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం అయ్యారు.

మంచు విష్ణు కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ తో.. అదీ రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. అంత బడ్జెట్ రికవరీ జరగాలంటే కేవలం మంచు విష్ణుతో వర్కౌట్ అవ్వదు. అందుకే ఇంతమంది స్టార్స్ ని రంగంలోకి దింపుతున్నాడు మంచు విష్ణు. ఇది ఓపెన్ సీక్రెట్. అయితే.. ఈ ప్రాజెక్టు నుండి ఓ స్టార్ తప్పుకున్నట్టు ఇన్సైడ్ టాక్.ఆ స్టార్ మరెవరో కాదు నయనతార. ఆమె అనూహ్యంగా ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్టు చెప్పిందట.

దీంతో ఆమె స్థానంలో అంటే పార్వతీదేవి పాత్రకి గాను కాజల్ అగర్వాల్ ను (Kajal Aggarwal) తీసుకున్నట్లు ఇన్సైడ్ టాక్. అవును త్వరలోనే కాజల్.. కన్నప్ప షూటింగ్లో జాయిన్ కాబోతోంది. గతంలో మంచు విష్ణు – కాజల్ కాంబినేషన్లో ‘మోసగాళ్ళు’ (Mosagallu) అనే సినిమా వచ్చింది. ఇందులో మంచు విష్ణు- కాజల్… అక్కాతమ్ముల్లుగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.