March 20, 202510:46:20 PM

Pawan Kalyan: ఆ విషయంలో ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేసిన పవన్ హీరోయిన్.. ఏమైందంటే?

సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జీవితాలు పైకి కనిపించినంత సంతోషంగా, అందంగా ఉండవు. పవన్ (Pawan Kalyan) సినిమాలైన ఖుషి (Kushi) , అత్తారింటికి దారేది (Atharintiki Daaredi) సినిమాలలో సాంగ్స్ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో ముంతాజ్ (Mumtaj) మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో సైతం ముంతాజ్ నటించారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ముంతాజ్ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. ఒకరోజు నాకు విపరీతమైన నడుము నొప్పి వచ్చిందని ఎటూ కదల్లేకపోయానని ఆమె తెలిపారు.

నడుము నొప్పి తగ్గాలని ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఆమె పేర్కొన్నారు. రెండు సంవత్సరాల పాటు ఆ నొప్పిని భరించానని ముంతాజ్ అన్నారు. ఆ తర్వాత ఆటో ఇమ్యూన్ వ్యాధితో నేను బాధ పడుతున్నట్టు తేలిందని ముంతాజ్ పేర్కొన్నారు. ఆ వ్యాధి వల్ల నొప్పులతో విలవిలలాడానని ఆమె అన్నారు. కీళ్ల జాయింట్ వద్ద సమస్య వల్ల కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడ్డానని ముంతాజ్ తెలిపారు. సరిగ్గా నిలబడలేకపోయానని శరీరాన్ని కదిలించడమే కష్టమయ్యేదని ముంతాజ్ చెప్పుకొచ్చారు.

ప్రతిరోజూ టాబ్లెట్స్ వేసుకునేదానినని ఒకానొక సమయంలో డిప్రెషన్ కు లోనయ్యానని ఆమె తెలిపారు. ఒకప్పుడు గ్లామర్ రోల్స్ చేసినందుకు ఇప్పుడు ఇబ్బందిగా ఫీలవుతున్నానని ముంతాజ్ అన్నారు. నా దగ్గర చాలా డబ్బులు ఉంటే ఆ డబ్బులతో ఆ ఫోటోలను ఇంటర్నెట్ లో డిలీట్ చేయాలనుందని ఆమె చెప్పుకొచ్చారు. కానీ అది నా వల్ల అయ్యేది కాదని ముంతాజ్ అన్నారు.

Mumtaz

దయచేసి ఫ్యాన్స్ ఎవరూ నా గ్లామర్ ఫోటోలను షేర్ చేయకూడదని కోరుకుంటున్నానని ఆమె వెల్లడించడం గమనార్హం. నేను చనిపోయినా సరే ఆ ఫోటోలను షేర్ చేయవద్దని పెళ్లంటారా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దామని ముంతాజ్ వెల్లడించారు. ముంతాజ్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముంతాజ్ కామెంట్స్ విషయంలో నెటిజన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.