Pawan Kalyan: ఆ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకున్న పవర్ స్టార్.. ఎంతంటే?

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జ్వరం తగ్గడంతో మళ్లీ పొలిటికల్ ప్రచారంపై దృష్టి పెట్టారు. రోజుకు ఒక నియోజకవర్గం చొప్పున ప్రచారం చేసేలా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఉందని పొలిటికల్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. పిఠాపురం నుంచి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ చేబ్రోలులో మూడంతస్తుల ఇంటిని అద్దెకు తీసుకున్నారు. పవన్ సొంతంగా ఇంటిని నిర్మించుకునే వరకు అద్దె ఇంటి నుంచి పార్టీకి సంబంధించి పనులను పూర్తి చేయనున్నారని సమాచారం అందుతోంది.

కొన్నిరోజుల క్రితం నివాసం ఉండటానికి ఇల్లు చూసుకుని ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకు మాట ఇవ్వగా ఆ మాటను నిలబెట్టుకున్నారు. శుక్రవారం ఈ ఇంటికి గృహ ప్రవేశం పూర్తైందని భోగట్టా. గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ కు, ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్ నిర్వహణకు అనువుగా ఉంటుందని పార్టీ నేతలు ఫీలవుతున్నారని తెలుస్తోంది. ఈ ఇంటికి సమీపంలో హెలీప్యాడ్ పనులు మొదలయ్యాయి.

ఈ ఇంటి ఓనర్ ఓదూరి నాగేశ్వరరావు పవన్ ఫ్యాన్ కావడంతో పవన్ కు ఇల్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. తనకు అద్దె వద్దని కేవలం రూపాయి ఇస్తే చాలని ఆయన చెప్పినట్టు సమాచారం అందుతోంది. పంట పొలాల్లో ఏర్పాటు చేసిన ఇల్లు జనసేన పార్టీకి అనుకూలంగానే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత వరుస సినిమాలతో బిజీ అవుతారని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఒక ప్రాజెక్ట్ కోసం కూడా ఆయన ఓకే చెప్పారని తెలుస్తోంది.

పవన్ నిజంగానే కొత్త సినిమాలను ప్రకటిస్తారో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. పవన్ ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారానికే పరిమితం కాగా ఓజీ (OG Movie) రిలీజ్ డేట్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని సమాచారం అందుతోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.