Prasanth Varma: ఇదే మ్యాజిక్‌ అక్కడ చేస్తే… నెత్తిన పెట్టేసుకుంటారు వర్మా…

తెలుగు దర్శకులతో సినిమా అంటే… ఒకప్పుడు తెలుగు హీరోనే ఉండేవాడు. అయితే పాన్‌ ఇండియా పుణ్యమా అని, బాలీవుడ్‌ తడబాటు పుణ్యమా అని… మన దర్శకులు ఇప్పుడు హాట్‌ కేక్‌లు అయ్యారు. ఏరి కోరి వచ్చి మరీ తెలుగు దర్శకులను, సౌత్‌ దర్శకులతో సినిమాలు చేస్తున్న బాలీవుడ్ హీరోలు. ఈ క్రమంలో మరో బ్లాక్‌బస్టర్‌ దర్శకుడు కూడా బాలీవుడ్‌ ఫ్లయిట్‌ ఎక్కబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయంలో ప్రకటన కూడా వస్తుందని చెబుతున్నారు.

ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) … ఒక సాధారణ దర్శకుడు ఏమీ కాదు. చేసిన తొలి సినిమా ‘ఆ!’లో (Awe) పాయింట్‌ వైవిధ్యంగా ఉంటుంది. అయితే మనకు అలాంటి కథలు అప్పటివరకు రాకపోవడం… స్క్రీన్‌ప్లే విషయంలో కాన్‌ఫ్లిక్ట్‌ ఉండటం వల్ల అందరికీ కనెక్ట్ కాలేదు. అయితే ఆ తర్వాత ‘జాంబీ రెడ్డి’ (Zombie Reddy) సినిమా చేశాక ఈ కుర్ర దర్శకుడిలో ఏదో మ్యాజిక్‌ ఉంది అనుకున్నారు. అనుకున్నట్లుగానే మూడో సినిమాగా ‘హను – మాన్‌’ (Hanu Man) ప్రారంభించి తానెంత స్పెషలో చెప్పాడు.

ఆ సినిమా విజయం జనాలకు ఎంత నచ్చిందో వసూళ్లు చెబితే… తనవారికి ఎంత నచ్చిందో ‘ఈ సినిమా తీసింది నా కొడుకు… వాడు నా కొడుకు’ అంటూ తండ్రి కాలర్‌ ఎగరేసి థియేటర్‌ నుండి బయటకు వచ్చి మాట్లాడారు. అది ప్రశాంత్‌ వర్మ. ఇప్పుడ ఈ టాలెంట్‌ నచ్చే బాలీవుడ్‌ పవర్‌ హౌస్‌, స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh) పిలిచి మరీ కథ వినిపించుకుని ఓకే చేశాడని అంటున్నారు. ‘జై హను మాన్‌’ పనుల్లో బిజీగా ఉన్న ప్రశాంత్‌.. ఆ పని అయ్యాక రణ్‌వీర్‌ సినిమా చేస్తారని టాక్‌.

రణ్‌వీర్‌కి రేంజికి తగ్గట్టు మైథలాజికల్ సబ్జెక్టునే చెప్పారట ప్రశాంత్‌ వర్మ. త్వరలో పూర్తి స్థాయి కథ సిద్ధం చేసుకుని మరోసారి కలుస్తారట. అయితే ఈ లోపు నిర్మాతను ఫైనల్‌ చేసే పనులు జరుగుతున్నాయట. జీ స్టూడియోస్, పెన్, జియో లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. రెండు పెద్ద నిర్మాణ సంస్థలు కలసి ముందుకొచ్చే అవకాశం ఉందట. అయితే రణ్‌వీర్‌ సింగ్‌ ‘శక్తిమాన్‌’ సినిమా అయితే చేయాల్సి ఉంది.ఆ విషయం పక్కనపెడితే.. ఇక్కడ ఇచ్చిన విజయమే బాలీవుడ్‌లోనూ ఇస్తే ప్రశాంత్‌ వర్మ నెత్తిన పెట్టేసుకుంటారు మరి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.