March 17, 202512:04:49 AM

Raghu Babu Car Accident: రఘుబాబు కారు ఢీకొని బీఆర్‌ఎస్‌ నాయకుడు మృతి.. ఏమైందంటే?

ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ రఘుబాబు (Raghu Babu) కారు, ఓ బైకు ఢీకొన్న ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వచ్చిన వ్యక్తి అక్కడిక్కడే చనిపోయాడు. దీంతో స్థానికులు రఘుబాబు కారును చుట్టుముట్టారు. ఈ క్రమంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులే తలెత్తాయి. ఇంతలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. బైక్‌పై బీఆర్‌ఎస్‌ నాయకుడు రాంగ్ రూట్లో రావడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని తేల్చారు. దీంతో కారులో డ్రైవరు పక్క సీటులో ఉన్న రఘుబాబు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు కొన్ని వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

నల్గొండ జిల్లా అద్దంకి – నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్ కాలనీకి చెందిన సందినేని జనార్దన్ రావు తన దత్త సాయి వెంచర్‌కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాదు నుండి మిర్యాలగూడ వైపు వెళ్తున్న KA 03 MP 6914 నెంబరు న్ కారు జనార్దన్ రావు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలై మృతి చెందాడు.

మృతుని భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సందినేని జనార్దన్ రావు స్వస్థలం నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామం. జనార్దన్ రావుకు భార్య నాగమణి, కుమార్తె, తనయుడు ఉన్నారు. అయితే ప్రమాదం అనంతరం రఘుబాబుతో స్థానికులు మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. ఆ సమయంలో రఘుబాబు టెన్షన్ పడుతుండగా పక్కన ఉన్న వ్యక్తులు నీళ్లు తాగండి, ఏం కాదు అని చెప్పడం కనిపిస్తోంది.

అయితే రఘుబాబు కారు బైకును దాదాపు 50 మీటర్ల దూరం లాక్కెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు కొందరు చెబుతున్నారు. దీంతో అసలు అక్కడ ఏం జరిగింది అనేది విచారణలో తేలనుంది. బుధవారం జరిగిన ఈ ఘటన సాయంత్రానికి వైరల్‌గా మారింది. దీనిపై రఘుబాబు ఏమన్నా స్పందిస్తారేమో చూడాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.