March 20, 202509:51:37 PM

హీరోలు వరుస కడుతున్న సమయంలో ఆ బ్లాక్‌ బస్టర్‌ హీరోయిన్‌ కూడా రెడీ!

సౌత్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలో హీరోయిన్లు బాలీవుడ్‌కి వెళ్లడం మనం గతంలో చూశాం. అయితే ఏమయ్యేదో ఏమో అలా వెళ్లినవాళ్లు అక్కడ నిలదొక్కుకోలేదు. ఒక్క సినిమా చేసి వచ్చేసినవాళ్లు కొందరు అయితే, కొన్ని సినిమాలు చేసినా విజయం దక్కక పూర్తిగా ఇండస్ట్రీలో డల్ అయినవాళ్లు ఇంకొందరు. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వస్తోంది అంటే… ఇప్పుడు మరో సౌత్‌ హీరోయిన్‌ బాలీవుడ్‌ ఫ్లయిట్‌ ఎక్కుతోంది అనే వార్తలు వస్తుండటమే. అవును మన దగ్గర గోల్డెన్‌ లెగ్‌ అనిపించుకున్న ఆమెనే.

వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే త్రిష (Trisha) , ఇలియానా (Ileana) , రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh), నయనతార (Nayanthara), ప్రియమణి (Priyamani) లాంటివాళ్లు బాలీవుడ్‌ వెళ్లారు. త్రిష ఒక్క సినిమాకే వెనక్కి వచ్చేయగా.. ఇలియానా అక్కడే ఉంటా అంటూ మనకు దూరమైంది. ఇప్పుడు రకుల్‌ ప్రీత్ సింగ్‌ కూడా అంతే. తెలుగు సినిమా కథలే ఆమె వినడం లేదు అని టాక్‌. ఇక ‘జవాన్‌’తో (Jawan) వెళ్లిన నయనతార ఒక్క సినిమా వరకే ఆ ట్రిప్‌ అని చెప్పకనే చెప్పింది అంటున్నారు. దీంతో ఇప్పుడు సంయుక్త (Samyuktha Menon) ఏం చేస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.

మధ్యలో సంయుక్త ఎందుకొచ్చింది అనుకుంటున్నారా? ఎందుకంటే ఆమెనే ఇప్పుడు బాలీవుడ్‌ సినిమాలకు వెళ్తోంది అని వార్తలొస్తున్నాయి కాబట్టి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) – రానా (Rana Daggubati) ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చిన ఈ మలయాళీ అందం గత రెండేళ్లలో తెలుగులో మరో నాలుగు సినిమాలు చేసింది. మధ్యలో తమిళ సినిమా కూడా చేసింది. అయితే ఇప్పుడు ఎందుకో కానీ సినిమాలు ఓకే చేయడం ఆపేసింది. కల్యాణ్‌ రామ్‌ (Nandamuri Kalyan Ram) ‘డెవిల్‌’ (Devil) ఆమె ఆఖరి సినిమా.

ఏమైందా అని చూస్తే… బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది అనే వార్తలు వస్తున్నాయి. ముంబయి బాంద్రాలోని మెహబూబ్ స్టూడియోలో సంయుక్త ఇటీవల కనిపించిందట. దీంతో బాలీవుడ్‌ ఆఫర్ల కోసమో, లేక పిలుపు రావడంతోనో ముంబయి ట్రిప్‌నకు వెళ్లింది అని అంటున్నారు. అయితే ఆమె ఇప్పటికే ఓకే చేసిన తెలుగు ప్రాజెక్టులు నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) ‘స్వయంభు’(Swayambhu) శర్వానంద్‌ (Sharwanand) సినిమా త్వరగా పూర్తి చేయాలని అనుకుంటోందట.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.