March 20, 202503:16:59 PM

Raj Tarun: నాకు పెళ్లి పిల్లలు వద్దు..పెళ్లిపై రాజ్ తరుణ్ ఓపెన్ కామెంట్స్!

రాజ్ తరుణ్ (Raj Tarun) టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరు. ‘ఉయ్యాలా జంపాలా’ ‘సినిమా చూపిస్తా మావా’ ‘కుమారి 21 ఎఫ్’ వంటి హిట్ సినిమాలతో ఒక్కసారిగా దూసుకొచ్చిన ఇతను.. తక్కువ టైంలోనే భారీగా పారితోషికాన్ని డిమాండ్ చేసే స్థాయికి ఎదిగాడు. అయితే ఆ సినిమాల తర్వాత రాజ్ తరుణ్ చేసిన సినిమాలు ఫ్లాప్ అవుతూ వచ్చాయి. మంచు విష్ణుతో (Manchu Vishnu) కలిసి చేసిన ‘ఈడో రకం ఆడో రకం’ మాత్రమే సక్సెస్ అయ్యింది.

ఇదిలా ఉండగా.. రాజ్ తరుణ్ హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు వంటివి నడుపుతున్నాడు అంటూ గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. హీరోయిన్ హెబ్బా పటేల్ తో (Hebah Patel) రాజ్ తరుణ్ డేటింగ్ లో ఉన్నట్టు కూడా గతంలో ప్రచారం జరిగింది. కానీ ‘మేము బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే’ అంటూ ఆ వార్తలను కొట్టిపారేసారు రాజ్ తరుణ్, హెబ్బా . అయితే 31 ఏళ్ల వయసు వచ్చినా రాజ్ తరుణ్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. తాజాగా తన పెళ్లి గురించి అతను చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి.

రాజ్ తరుణ్ మాట్లాడుతూ… ” జీవితంలో పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యాను. నాకు పెళ్లి, పిల్లలు వద్దు.నేను సింగిల్ గా చాలా హ్యాపీగా ఉన్నాను. ఉంటాను..! పెళ్లి విషయంలో మా పేరెంట్స్ ముఖ్యంగా మా నాన్న ముందు నుండి ‘నీ ఇష్టం’ అనేవారు. అమ్మ మాత్రం పెళ్లి చేసుకోమని మొదట నస పెట్టినా ఇప్పుడైతే ‘నీ ఇష్టం’ అని వదిలేసింది.సో పెళ్లి చేసుకోమని మా ఇంట్లో నా పై ఒత్తిడి లేదు” అంటూ చెప్పుకొచ్చాడు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.