Rajinikanth, Lokesh Kanagaraj: లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో నాగ్.. అలాంటి రోల్ లో కనిపిస్తారా?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) వరుస విజయాలు సాధిస్తూ సినిమా ఇండస్ట్రీలోని ప్రామిసింగ్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. రజనీకాంత్ (Rajinikanth) లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిన సంగతి విదితమే. ఈ సినిమాలో నాగార్జున (Nagarjuna) కథను మలుపు తిప్పే పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. నాగ్ రోల్ సినిమాకే హైలెట్ కానుందని సమాచారం అందుతోంది. నా సామిరంగ (Naa Saami Ranga) సినిమాతో సక్సెస్ అందుకున్న నాగ్ వరుసగా తమిళ సినిమాలలో గెస్ట్ రోల్స్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.

ధనుష్ (Dhanush) శేఖర్ కమ్ముల (Sekhar Kammula) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కుబేరలో కూడా నాగ్ నటిస్తున్నారు. సాధారణంగా నాగార్జున గెస్ట్ రోల్స్ లో నటించడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. గెస్ట్ రోల్స్ లో నటించడం గురించి కొంతమంది విమర్శలు చేసినా నాగ్ మాత్రం ఆ విమర్శలను పట్టించుకోరు. బంగారం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రజనీ లోకేశ్ కాంబో మూవీ తెరకెక్కుతుండగా అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించి టైటిల్ రివీల్ కానుంది.

రజనీ లోకేశ్ కాంబో సినిమాలో నాగ్ నటిస్తున్నట్టు అధికారికంగా క్లారిటీ మాత్రం రావాల్సి ఉంది. వేట్రయాన్ సినిమాను పూర్తి చేసిన వెంటనే రజనీకాంత్ ఈ సినిమాతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. లియో (LEO) సినిమా సెకండాఫ్ విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చిన నేపథ్యంలో తర్వాత సినిమాల స్క్రిప్ట్ విషయంలో లోకేశ్ కనగరాజ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

నాగ్ సోలో హీరోగా కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది. బిగ్ బాస్ షో సీజన్8 కు కూడా నాగార్జున హోస్ట్ గా కెరీర్ ను కొనసాగించనున్నారని తెలుస్తోంది. కొడుకుల కెరీర్ పై కూడా నాగ్ ప్రత్యేక దృష్టి పెట్టారని సమాచారం అందుతోంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.