March 25, 202511:29:02 AM

Rajinikanth: రజనీకాంత్‌ ‘వేట్టయాన్‌’… పాత తలైవాను చూపించే ప్రయత్నం!

రజనీకాంత్‌ (Rajinikanth) సినిమా అంటే ఇన్‌బిల్ట్‌ మాస్ సినిమా అని చెప్పేయొచ్చు. ఆయన ఏ జోనర్‌లో సినిమా చేసినా… అందులో మాస్ ఎలిమెంట్స్‌ పుష్కలంగా ఉండేలా చూసుకుంటారు. ఈ క్రమంలో ఇంట్రడక్షన్‌ సాంగ్‌ భారీగా ఉండటం అలవాటు. కొన్నేళ్ల క్రితం వరకు ఇలానే ఉండేది. రజనీ సినిమా అంటే అదిరిపోయే ఇంట్రడక్షన్‌ సాంగ్‌ పక్కా అని అనుకుంటూ థియేటర్లకు వచ్చేవారు. ఆ పాటను చూసి ఎంజాయ్‌ చేసేవారు. అయితే ఇటీవలి సినిమాల్లో అలాంటి సాంగ్‌ ఉండటం లేదు.

పైన చెప్పినట్లు రజనీకాంత్‌ చిత్రాల్లో ఇంట్రడక్షన్‌ సాంగ్స్‌ ఇప్పుడు లేకపోవడం కొంత వెలితిగా ఉంది అని నెటిజన్లు, ఫ్యాన్స్‌ అంటున్నారు. దానిని భర్తీ చేసేలా ‘వేట్టయాన్‌’ సినిమాలో ఓ సాంగ్‌ రెడీ చేశారట. ఈ నెల 25న చెన్నైలోని సుందర్‌ స్టూడియోలో ఈ పాట చిత్రీకరణ మొదలవుతుందట. దీని కోసం ఇప్పటికే అక్కడ భారీ సెట్‌ వేశారట. డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ దినేశ్‌ మాస్టర్‌ ఈ పాటను స్టెప్స్‌ కంపోజ్‌ చేస్తారట. ఈ పాటలో రజనీతో పాటు ఇతర నటులూ ఉంటారట.

జ్ఞానవేల్‌రాజా దర్శకత్వంలో రజనీకాంత్‌ నటిస్తున్న చిత్రమే ‘వేట్టయాన్‌’. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) , ఫహాద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) , రానా (Rana) , మంజు వారియర్‌, రితికా సింగ్‌ (Ritika Singh) తదితరులు నటిస్తున్నారు. అనిరుద్‌ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం చెన్నై ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డులో జరుగుతోంది. రానాకు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ‘అణ్ణామలై’, ‘బాషా’ (Baashha) సినిమాల్లో ఇంట్రడక్షన్‌ సాంగ్‌ తరహాలో ఈ పాట ఉంటుంది అని చెబుతున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత రజనీకాంత్‌ – లోకేశ్ కనగరాజ్‌ల (Lokesh Kanagaraj) సినిమా మొదలవుతుంది. బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ పోస్టర్‌ రిలీజ్ అయింది. ఈ నెల 17న పూర్తి వివరాలు వెల్లడిస్తామని టీమ్‌ చెప్పింది. ఆ రోజు టైటిల్‌ కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఈ సినిమా ఎల్‌సీయూలోనే ఉంటుందా? లేక వేరే సినిమానా అనేది తెలియాల్సి ఉంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.