March 20, 202510:46:26 PM

Ram Charan: సిద్ధూను చూసి గర్వంగా ఫీలవుతున్నా.. చరణ్ కామెంట్స్ వైరల్!

సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా నటించిన టిల్లు స్క్వేర్ (Tillu Square) మూవీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ సినిమా గురించి ప్రశంసించగా తాజాగా ఆ జాబితాలో రామ్ చరణ్ (Ram Charan) చేరారు. డియర్ సిద్ధూ.. నీ సక్సెస్ ను చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని రామ్ చరణ్ పేర్కొన్నారు. ఇంత గొప్ప సక్సెస్ ను అందుకున్నందుకు అనుపమ పరమేశ్వరన్, మల్లిక్ రామ్ సితార టీం మొత్తానికి హృదయ పూర్వక అభినందనలు అని చరణ్ వెల్లడించారు.

రామ్ చరణ్ చేసిన ట్వీట్ కు 17 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. చరణ్ ఈ సినిమాను ప్రశంసించడంతో రాబోయే రోజుల్లో ఈ సినిమాకు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. టిల్లూ స్క్వేర్ ఫుల్ రన్ లో 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టిల్లూ స్క్వేర్ మూవీని ఇతర భాషల్లోకి సైతం డబ్ చేస్తే బాగుంటుందని ఈ సినిమా ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

టిల్లూ స్క్వేర్ డబ్బింగ్ విషయంలో మేకర్స్ ప్లాన్ ఏ విధంగా ఉందో చూడాల్సి ఉంది. ఓటీటీలో సైతం ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టిల్లూ స్క్వేర్ సినిమా సక్సెస్ సాధించడంతో రాబోయే రోజుల్లో ఈ తరహా కథాంశాలతో మరిన్ని సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది.

టిల్లూ క్యూబ్ సినిమా కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని వీలైనంత వేగంగా ఈ సినిమాను తెరకెక్కించి విడుదల చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ సినిమాసినిమాకు తన మార్కెట్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.