Rathnam Collections: ‘రత్నం’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal) , అక్కడి స్టార్ డైరెక్టర్ హరి (Hari) కాంబినేషన్లో ‘భరణి’ ‘పూజా’ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. మూడో చిత్రంగా ‘రత్నం'(తమిళ్ లో ‘రత్తం’) (Rathnam) రూపొందింది. ‘భరణి’ ‘పూజా’ చిత్రాలు తెలుగులో కూడా బాగా ఆడాయి. అందుకే ‘రత్నం’ పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ‘జీ స్టూడియోస్‌’తో పాటు ‘స్టోన్ బెంచ్ ఫిల్మ్స్’ బ్యానర్ల పై కార్తికేయన్ సంతానం ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్  (Priya Bhavani Shankar) హీరోయిన్ గా నటించింది.

ఏప్రిల్ 26న నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి.కానీ రెండో రోజు టాక్ ఎఫెక్ట్ వల్ల కలెక్షన్స్ పడిపోయాయి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.33 cr
సీడెడ్ 0.14 cr
ఉత్తరాంధ్ర 0.11 cr
ఈస్ట్ 0.06 cr
వెస్ట్ 0.03 cr
గుంటూరు 0.06 cr
కృష్ణా 0.07 cr
నెల్లూరు 0.03 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.83 cr

‘రత్నం’ చిత్రానికి రూ.3.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి రూ.3.7 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా రూ.0.83 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.2.87 కోట్ల షేర్ ను రాబట్టాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.