March 20, 202507:44:17 PM

Rowdy Boys: దిల్ రాజు వారసుడి ప్లాప్ సినిమా రీ రిలీజ్.. అవసరమా?

దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ (Ashish Reddy) హీరోగా ‘లవ్ మీ’ (Love Me) అనే సినిమా రూపొందింది. ‘బేబీ’ (Baby) ఫేమ్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. రైటర్ అరుణ్ భీమవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నాడు. ఇదొక హారర్ థ్రిల్లర్‌ సినిమా. ఓ గ్లింప్స్ ను అలాగే ఓ పాటని ఇప్పటికే విడుదల చేయడం వాటికి డీసెంట్ రెస్పాన్స్ రావడం జరిగింది.

ఏప్రిల్ 25న సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న టైంకి కంప్లీట్ అవ్వకపోవడంతో ఈ చిత్రం విడుదలని వాయిదా వేశారు. అది పక్కన పెడితే… ‘లవ్ మీ’ రిలీజ్ డేట్ వృధా చేసుకోకూడదు అనుకున్నారో ఏమో కానీ… అదే డేట్ కి ఇంకో సినిమాను విడుదల చేయడానికి దిల్ రాజు (Dil Raju) అండ్ టీం రెడీ అయ్యింది.

వివరాల్లోకి వెళితే.. ఆశిష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘రౌడీ బాయ్స్’ (Rowdy Boys) చిత్రం 2022 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి.. ఫైనల్ గా ప్లాప్స్ లిస్ట్ లో చేరింది. అయినప్పటికీ ఈ ఏడాది అంటే 2024 ఏప్రిల్ 25 న ఆ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నట్టు దిల్ రాజు టీం ప్రకటించింది. ప్లాప్ సినిమాలను రీ రిలీజ్ చేసిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం.

కానీ ఇంత షార్ట్ టైంలో ఓ ప్లాప్ సినిమాని రీ రిలీజ్ చేయాలనే ఆలోచన దిల్ రాజు అండ్ టీంకి ఎందుకు వచ్చిందో..! బహుశా.. ఆశిష్ ను మర్చిపోతారు అనుకున్నారో లేక ‘లవ్ మీ’ వచ్చే వరకు ‘రౌడీ బాయ్స్’ ని దానికి ప్రమోషన్ గా వాడుకోవాలనుకుంటున్నారో. సరే..వీళ్ళు అనుకుని రీ రిలీజ్ చేసినా… ప్రేక్షకులు వచ్చి చూస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే ‘లవ్ మీ’ ప్రోమోస్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అనేది మాత్రం వాస్తవం.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.