Sayaji Shinde: ఆస్పత్రిలో చేరిన సాయాజీ షిండే..ఏమైందంటే?

సాయాజీ షిండే (Sayaji Shinde) అందరికీ సుపరిచితమే. టాలీవుడ్లో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న పరభాషా నటుల్లో ఈయన కూడా ఒకరు.ఇదిలా ఉండగా… ఈయన హాస్పిటల్లో బెడ్ పై పడుకుని ఉన్న ఓ ఫోటో ఇప్పుడు సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. నిన్న అంటే గురువారం నాడు సాయాజీ షిండే అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు.. ఆ సందర్భంలో ఈ ఫోటో తీసినట్టు తెలుస్తుంది. ఛాతిలో గట్టిగా నొప్పి రావడంతో వెంటనే ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారట కుటుంబ సభ్యులు.

హాస్పిటల్లో డాక్టర్లు ఆయనకు కొన్ని టెస్టులు చేయడం.. ఈ క్రమంలో సాయాజీ షిండే గుండెలో వెయిన్ బ్లాక్ ఉన్నట్లు గుర్తించడం జరిగిందట. దీంతో ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారట. ప్రస్తుతం సాయాజీ షిండే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే అతన్ని డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలియజేశారట. సో కంగారు పడాల్సిన పనిలేదు.. త్వరలోనే ఆయన నార్మల్ అయ్యి తిరిగొస్తారు అని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ అవుతుంది.

ఇక జేడీ చక్రవర్తి (J. D. Chakravarthy) ‘సూరి’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సాయాజీ షిండే.. ఆ తర్వాత వచ్చిన చిరంజీవి (Chiranjeevi) ‘ఠాగూర్’ (Tagore) సినిమాతో పాపులర్ అయిపోయారు. ఆ తర్వాత వెంటనే పెద్ద సినిమాల్లో విలన్ రోల్స్ రావడంతో సాయాజీ షిండే తెలుగులో కూడా స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నారు. మహారాష్ట్రకు చెందిన వ్యక్తే అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులు ఇతన్ని బాగానే ఓన్ చేసుకుని స్టార్ స్టేటస్ ను కట్టబెట్టారు అని చెప్పాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.