March 22, 202504:48:45 AM

Shruti Haasan: రొమాంటిక్‌ సాంగ్‌ తర్వాత… రొమాంటిక్‌ సినిమా.. అంతా రొమాంటిక్‌!

చేసినవి తక్కువ సినిమాలే అయినా… అన్నింటా విజయం సాధించాలని చాలామంది ఉంటుంది. అలాంటి ఫీట్‌ను గతేడాది చేసి భారీ విజయాలు అందుకుంది శ్రుతి హాసన్‌ (Shruti Haasan) . నాలుగు సినిమాలతో గతేడాది ఆమెకు బ్లాక్‌బస్టర్లు వచ్చాయి. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా అంతే జోరు కొనసాగించాలని చూస్తోంది. ఇప్పటికే ఓ పాట రిలీజ్‌ చేసి సింగిల్స్‌ విభాగంలో రొమాంటిక్‌ హిట్‌ సాధించింది. ఇప్పుడు అదే జోనర్‌లో ఓ సినిమా చేయబోతోంది. ఈ సినిమా చిత్రీకరణను రీసెంట్‌గా ప్రారంభించారు. ఈ సినిమాలో ఆమె డిటెక్టివ్‌గా కనిపించనుందట.

చరిత్రలో దాగి ఉన్న ఎన్నో కథలను ప్రపంచానికి తెలియజేయడానికి వస్తున్నామంటూ ‘చెన్నై స్టోరీ’ అనే సినిమాను ఇటీవల ప్రకటించింది శ్రుతి హాసన్‌. ఆమె ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఫిలిప్‌ జాన్‌ తెరకెక్కిస్తున్నారు. ‘ది అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రొమాంటిక్‌ కామెడీ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో శ్రుతి హాసన్‌ డిటెక్టివ్‌గా కనిపిస్తుందట. ‘కొత్త సినిమా… కొత్త ప్రయాణం’ అంటూ ఓ వీడియోను షేర్‌ చేసింది శ్రుతి హాసన్‌.

‘ఇనిమేల్‌’ అనే మ్యూజికల్‌ వీడియో సాంగ్‌తో లోకేశ్‌ కనగరాజ్‌తో (Lokesh Kanagaraj) కలిసి ప్రేక్షకులను పలకరించింది శ్రుతి. ఈ సినిమా కాకుండా శ్రుతి చేతిలో ప్రభాస్‌ (Prabhas) – ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) ‘సలార్‌: శౌర్యాంగ పర్వం’ (Salaar) , అడివి శేష్‌ (Adivi Sesh) ‘డెకాయిట్‌’ సినిమాలు ఉన్నాయి. ‘సలార్‌ : శౌర్యాంగ పర్వం’ సంగతి తెలియదు కానీ… ‘డెకాయిట్‌’ అయితే ఈ ఏడాదిలోనే రిలీజ్‌ అవుతుంది అంటున్నారు. ఇక ‘చెన్నై స్టోరీ’ సినిమా కూడా 2024లో రిలీజ్‌ చేయాలని చూస్తున్నారట.

‘ఇనిమేల్‌’ సాంగ్‌ టీజర్‌లో కనిపించినట్లు కేవలం ఒక మూడ్‌లోనే పాట సాగదు. కొత్త జంట కొత్త లైఫ్‌ను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది. ఒక్కో ఎలిమెంట్‌ యువతకు బాగా నచ్చేలా చూసుకున్నారు. ఈ పాటలో శ్రుతి సరసన ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌ నటించాడు. ఇక ఈ పాటను లోకనాయకుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) రచించాడు. అన్నట్లు గతేడాది శ్రుతి హిట్లు చెప్పలేదుగా.. ‘వాల్తేరు వీరయ్య’(Waltair Veerayya) , ‘వీర సింహా రెడ్డి’ (Veera Simha Reddy) , ‘హాయ్‌ నాన్న’(Hi Nanna), ‘సలార్‌’.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.