March 22, 202504:48:41 AM

Teja Sajja: వైరల్ అవుతున్న తేజ సజ్జా ఆసక్తికర వ్యాఖ్యలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తేజ సజ్జా వరుస విజయాలతో సత్తా చాటుతున్నారు. తేజ సజ్జా (Teja Sajja) సినిమా అంటే మినిమం గ్యారంటీ అని టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరుంది. తేజ సజ్జా సినిమా సినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటున్నారు. హనుమాన్ (Hanu-Man) సినిమా ఏకంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగించిందనే సంగతి తెలిసిందే. అయితే ఎంత ఎదిగినా తేజ సజ్జా సింపుల్ గా ఉంటున్నారు.

కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) డైరెక్షన్ లో మిరాయ్ (Mirai) టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో సూపర్ యోధగా తేజ సజ్జా కనిపించనున్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ యోధ ఎవరనే ప్రశ్నకు తేజ సజ్జా మాత్రం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేరు సమాధానంగా చెప్పారు. ఓజీ (OG Movie) సినిమా గ్లింప్స్ చూసిన తర్వాత నాకు ఈ అభిప్రాయం కలిగిందని ఆ సినిమాకు సూపర్ యోధ టైటిల్ సూట్ అవుతుందని తేజ సజ్జా చెప్పుకొచ్చారు.

పవన్ ను ఓజీ సినిమాలో యోధుడిలా చూపిస్తున్నారనేలా తేజ సజ్జా చేసిన కామెంట్లు ఫ్యాన్స్ కు ఎంతగానో నచ్చేశాయి. భవిష్యత్తులో పవన్, తేజ సజ్జా కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓజీ సినిమా 200 కోట్ల రూపాయల రేంజ్ లో బడ్జెట్ తో తెరకెక్కుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

ఓజీ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తుండగా శ్రియారెడ్డి (Sriya Reddy) కీలక పాత్రలో నటిస్తున్నారు. ఓజీ సినిమా ఒకింత స్పెషల్ గా ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. చెప్పిన తేదీకి ఈ సినిమా విడుదలైతే సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఎన్నికలు పూర్తైతే ఓజీ సినిమా అనుకున్న తేదీకి రిలీజవుతుందో లేదో పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.