March 22, 202501:42:14 AM

Thandel: తండేల్ మూవీ విషయంలో మేకర్స్ కాన్ఫిడెన్స్ వెనుక అసలు లెక్క ఇదే!

అక్కినేని హీరో నాగచైతన్యకు (Naga Chaitanya) ప్రస్తుతం కెరీర్ పరంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవసరం అనే సంగతి తెలిసిందే. దూత వెబ్ సిరీస్ హిట్టైనా ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కావడంతో చైతన్య కెరీర్ కు పెద్దగా బెనిఫిట్ కలగలేదు. ప్రస్తుతం తండేల్ (Thandel) సినిమాపైనే చైతన్య ఆశలు ఉన్నాయి. చందూ మొండేటి (Chandoo MondetiV) దర్శకత్వం వహించడం, సాయిపల్లవి (Sai Pallavi) యాక్టింగ్ ఈ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. తండేల్ సినిమాలో కొన్ని సీక్వెన్స్ లు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

హాలీవుడ్ రేంజ్ సీక్వెన్స్ లు ఈ సినిమాలో ఉన్నాయని సమాచారం అందుతోంది. తండేల్ సినిమాలో మత్స్యకారుడి పాత్రలో చైతన్య కనిపించనుండగా ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని సమాచారం అందుతోంది. వర్షంలో వచ్చే బోట్ ఛేజింగ్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని భోగట్టా. ఈ సీన్ సినిమాకు హైలెట్ గా నిలవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. తండేల్ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

తండేల్ సినిమా రిలీజ్ తర్వాత ఏ రేంజ్ లో ప్రేక్షకుల మెప్పు పొందుతుందో చూడాల్సి ఉంది. 70 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. నాగచైతన్య తండేల్ సినిమాకు సోలో రిలీజ్ డేట్ దక్కితే మాత్రం ఈ సినిమాకు కచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.

నాగచైతన్య ఇతర భాషలపై సైతం ఫోకస్ పెడితే ఆయన రేంజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. చైతన్య మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథలపై ఫోకస్ పెడుతున్నారు. చైతన్య రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. చైతన్య పారితోషికం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.