March 21, 202501:01:47 AM

The Family Star: తమిళ క్రిటిక్ రివ్యూపై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) , మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ (Family Star) సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ రివ్యూలు వచ్చాయి. ఫస్టాఫ్ బాగుందని సెకండాఫ్ ఫస్టాఫ్ స్థాయిలో లేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి. ఈ సినిమా తెలుగుతో పాటే తమిళంలో కూడా ఈ సినిమా రిలీజ్ కాగా తమిళంలో మాత్రం ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ఒక క్రిటిక్ మాత్రం ఈ సినిమాకు మరీ దారుణంగా రివ్యూ ఇచ్చారు. ఫ్యామిలీ స్టార్ కాదని క్రింజ్ స్టార్ అని బోరింగ్ మూవీ అని ఔట్ డేటెడ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని ఆయన కామెంట్లు చేశారు.

సినిమాలో విజయ్, మృణాల్ కాంబో సీన్స్ బాలేవని సిల్లీ సీన్స్ ఉన్నాయని తమిళ క్రిటిక్ పేర్కొన్నారు. కొన్ని సీన్స్, సాంగ్స్ తప్ప సినిమాలో ఏం బాలేవని ఆయన అభిప్రాయపడ్డారు. జీరో ఎమోషనల్ కనెక్ట్ అంటూ క్రిటిక్ ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇవ్వడం గమనార్హం. అయితే తమిళ్ క్రిటిక్ రివ్యూపై నెటిజన్లు ఫీలవుతున్నారు. సినిమా చూడకుండా రివ్యూ ఇచ్చారా అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

క్రిస్టోఫర్ కనగరాజ్ అనే క్రిటిక్ ఈ రివ్యూ ఇచ్చారు. తెలుగు సినిమాలపై ఇంత పగేంటి అంటూ మరి కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చెబుతుండటం గమనార్హం. దిల్ రాజు (Dil Raju) ఈ సినిమా గురించి మాట్లాడుతూ 90 శాతం కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్ చేసున్నారని వెల్లడించారు.

ఫస్టాఫ్, ప్రీ క్లైమాక్స్ నుంచి బాగుందని ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాపై దిల్ రాజు నమ్మకం నిజమవుతుందో లేదో ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లతో తేలిపోనుంది. ఈ సినిమా విడుదలకు ముందే దిల్ రాజుకు మంచి లాభాలను అందించనుంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.