March 15, 202511:59:21 AM

Vakeel Saab: పవన్ ఫ్యాన్స్ కి ఇంట్రెస్టింగ్ అప్డేట్ .!

‘అజ్ఞాతవాసి’ (Agnyaathavaasi) తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు.ఆ తర్వాత పూర్తిగా తన జనసేన పార్టీ కోసమే పని చేస్తానని ఆయన తెలియజేశారు. దీంతో అభిమానులు చాలా అప్సెట్ అయ్యారు. కానీ 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘోర పరాజయం పాలయ్యారు. ఆ టైంలో ఎన్నికలకి టైం ఉంది కాబట్టి.. పవన్ కళ్యాణ్ ను తిరిగి సినిమాల్లో నటించవలసిందిగా అభిమానులు కోరారు. వారి కోరికని పట్టించుకున్న పవన్ కళ్యాణ్ హిందీలో సూపర్ హిట్ అయిన ‘పింక్’ రీమేక్ కి ఓకే చెప్పారు.

దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో వేణు శ్రీరామ్ (Venu Sriram) డైరెక్ట్ చేసిన ఈ సినిమా కోవిడ్ కారణంగా ఆలస్యంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. 2021 ఏప్రిల్ 9 న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. అయితే ఇందులో పొలిటికల్ సెటైర్లు ఎక్కువగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. టికెట్ రేట్లు తగ్గించేసి కలెక్షన్స్ పై దెబ్బ కొట్టింది.

అయితే ఓటీటీలో ఈ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది. ఇదిలా ఉండగా.. త్వరలో ఈ సినిమాని మళ్ళీ రీ- రిలీజ్ చేయబోతున్నారట. ఇప్పుడు ఎన్నికల టైం కాబట్టి.. పెద్ద సినిమాలు ఏమీ లేవు. దీంతో నిర్మాత దిల్ రాజు తన సినిమాలని రీ రిలీజ్ చేసే పనిలో పడ్డారు. ఏప్రిల్ 25న ‘రౌడీ బాయ్స్’ ని (Rowdy Boys) రీ రిలీజ్ చేశారు. అలాగే మే 1 న ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) ని కూడా రీ రిలీజ్ చేయడానికి దిల్ రాజు రెడీ అయినట్లు తెలుస్తుంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.