March 21, 202512:31:41 AM

Vakeel Saab: పవన్ వకీల్ సాబ్ రీరిలీజ్ బుకింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసా?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినీ కెరీర్ లోని హిట్ సినిమాలలో వకీల్ సాబ్ (Vakeel Saab) సినిమా కూడా ఒకటి. వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర నిడివి ఇతర సినిమాలతో పోలిస్తే తక్కువే అయినా ఈ సినిమా పవన్ అభిమానులకు ఎంతో నచ్చేసింది. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కడం ఈ సినిమాకు మరింత ప్లస్ అయింది. ఈ సినిమా రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రీరిలీజ్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు.

ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ చేయకుండా రీరిలీజ్ చేయడం ఈ సినిమాకు మైనస్ అవుతోంది. రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదలవుతున్నా ఏ థియేటర్ లో కూడా 50 శాతం ఆక్యుపెన్సీ దాటలేదు. ఎన్నికల సమయంలో రీరిలీజ్ చేయడం కూడా ఈ సినిమాకు మైనస్ అవుతోంది. ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాలు చూసే మూడ్ లో లేరు. అందువల్ల వకీల్ సాబ్ సినిమాకు మరీ భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడం కూడా సులువైన విషయం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వకీల్ సాబ్ సినిమాకు ఇప్పటికైనా ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచితే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వకీల్ సాబ్ మూవీ వేణు శ్రీరామ్ (Venu Sriram)  డైరెక్షన్ లో దిల్ రాజు (Dil Raju)  నిర్మాతగా తెరకెక్కడం గమనార్హం. పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం చాలా ఏరియాలలో ఎన్నికల ప్రచారం వల్ల బిజీగా ఉన్న నేపథ్యంలో వకీల్ సాబ్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) నుంచి టీజర్ రిలీజ్ కానున్నట్టు ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. పవన్ సినిమాలు తరచూ వార్తల్లో నిలుస్తుండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం. పవన్ కు ఈ ఏడాది సినిమాల పరంగా, పొలిటికల్ కెరీర్ పరంగా కలిసిరావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.