March 22, 202509:06:36 AM

Varalakshmi Sarathkumar: ఫస్ట్ సినిమా… అలా ఎందుకు వదిలేసిందో చెప్పిన వరలక్ష్మి

టాలీవుడ్‌లో సరైన లేడీ విలన్‌ అంటే మొన్నటివరకు దొరకడం చాలా కష్టం. అయితే అదంతా వరలక్ష్మి శరత్‌ కుమార్‌ (Varalaxmi Sarathkumar) విలన్‌గా మారేంతవరకే. ఆమె ఎప్పుడైతే ప్రతినాయిక పాత్రలకు సిద్ధమైందో అప్పుడే ఆ కొరత తీరిపోయింది. అలా అని అన్నీ అలాంటి పాత్రలే చేస్తోందని కాదు… సహాయ నటి పాత్రలు, సోదరి పాత్రలు, కీలక పాత్రలు చేసి మెప్పిస్తోంది. అయితే ఇన్ని చేసినా ఆమె తొలి సినిమా ఇంకా ముందుకు రాలేదు. అయితే అది నటిగా చేసింది కాదు.

నటిగా చేసింది కాకపోతే ఇంకేంటి అనుకుంటున్నారా? కొన్నేళ్ల క్రితం వరలక్ష్మి శరత్‌ కుమార్‌ దర్శకురాలి అవతారం ఎత్తింది. ఆ మేరకు ఓ సినిమాను ప్రకటించింది కూడా. అదే ‘కన్నమూచి’. ఈ సినిమా అప్‌డేట్‌ గురించి ఇటీవల ఆమె దగ్గర ప్రస్తావించగా.. ఆసక్తికర సమాధానం ఇచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం దర్శకురాలిగా ‘కన్నమూచి’ సినిమాను ప్రకటించా. కానీ ఇప్పుడు నటిగా తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నాను. అందుకే ఆ సినిమా పక్కన పెట్టా అని చెప్పింది.

తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడానికి నా వంతు కృషి చేస్తున్నానని, ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగు సినిమాకు ధన్యవాదాలు చెప్పింది వరలక్ష్మి. మళ్లీ ‘కన్నమూచి’ సినిమా పనులు ప్రారంభించినప్పుడు అందరికీ చెబుతాను అని క్లారిటీ ఇచ్చింది. మరి ఎంగేజ్‌ మెంట్‌ చేసుకున్నారు కదా… పెళ్లి తేదీ ఎప్పుడు అని అడిగితే… ఇంకా ఆ విషయం తనకే తెలియదని అని చెప్పింది. ప్రస్తుతం తన ఫోకస్‌ అంతా సినిమాలపైనే అని చెప్పేసింది.

ముంబయికి చెందిన వ్యాపారవేత్త నికోలయ్‌ సచ్‌దేవ్‌తో మార్చి 1న వరు శరత్‌కుమార్‌ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఆమె సినిమాల సంగతి చూస్తే… అనిల్‌ కాట్జ్‌ తెరకెక్కించిన ‘శబరి’ మే 3న విడుదలవుతుంది. ఇది కాకుండా మరికొన్ని తెలుగు సినిమాలు ఓకే చేసింది. అందులో చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara) కూడా ఉందని సమాచారం. ఇది కాకుండా ‘రాయన్‌’, ‘కలర్స్‌’ అనే సినిమాలు కూడా వరుసలో ఉన్నాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.