Vijay Devarakonda: విజయ్ మంచిపేరు తెచ్చుకుంటే తప్పా.. విజయ్ మేనమామ కామెంట్స్ వైరల్!

శుక్రవారం రోజున విడుదలైన ఫ్యామిలీ స్టార్ (The Family Star) మూవీకి యావరేజ్ టాక్ వచ్చింది. అయితే సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుండటంతో ఆ టాక్ ప్రభావం కలెక్షన్లపై కొంతమేరపడుతోంది. దిల్ రాజు (Dil Raju) సైతం సినిమా రివ్యూలను మూడు రోజుల పాటు ఆపాల్సి ఉందని అలా చేస్తే మాత్రమే ఇండస్ట్రీ బాగుపడుతుందని చెప్పారు. మరోవైపు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) టార్గెట్ గా కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ మరింత ఎక్కువ కావడంతో విజయ్ దేవరకొండ మేనమామ యశ్ రంగినేని నెగిటివ్ పబ్లిసిటీ గురించి రియాక్ట్ అయ్యారు.

ఎందుకురా బాబు మా వాడి వెంట మరీ ఇలా పడ్డారంటూ ఆయన కామెంట్లు చేశారు. ఇంత కసా? ఓర్వలేని తనమా? లేక విజయ్ దేవరకొండ కటౌట్ చూసి భయమా? అంటూ కామెంట్లు చేశారు. ఒక మంచి విలువలతో, మెసేజ్ తో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయాల్సిన సినిమాను సైతం వదలడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మీ నెగిటివ్ బ్యాచ్ కు విజయ్ దేవరకొండ అంటే ఎలాగూ పడదని కానీ సినిమాను ఇష్టపడే వాళ్లను సైతం రాకుండా చేస్తున్నారని యశ్ రంగినేని పేర్కొన్నారు.

ఏ హీరో సినిమాకు లేని లాజిక్స్ మావోడి సినిమాలకు మాత్రం భూతద్దం పెట్టి వెతుకుతారని ఆయన పేర్కొన్నారు. బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి మంచి హీరోగా విజయ్ పేరు తెచ్చుకోవడం తప్పా? అని ఆయన కామెంట్లు చేశారు. విజయ్ దేవరకొండ సైతం తనపై వస్తున్న నెగిటివిటీ గురించి త్వరలో స్పందించే ఛాన్స్ అయితే ఉంది.

ఫ్యామిలీ స్టార్ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాల్సి ఉంది. ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్న వాళ్లపై విజయ్ దేవరకొండ టీం మాదాపూర్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. విజయ్ దేవరకొండ తర్వాత ప్రాజెక్త్ లతో భారీ హిట్స్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.