Vijay Deverakonda: హైప్‌లు చాలు విజయ్‌… రియాలిటీకి తొందరగా రా! లేదంటే కష్టమే!

విజయ్‌ దేవరకొండకు (Vijay Devarakonda)  సరైన విజయం వచ్చి ఆరేళ్లు అవుతోంది. ఏంటీ నిజమా? అనే డౌట్‌ మీకు అస్సలు అక్కర్లేదు. ఎందుకంటే 2018లో విజయ్‌కి బ్లాక్‌బస్టర్‌ విజయాలు, మోస్తరు విజయాలు వచ్చాయి. ఆ తర్వాత ఇప్పటివరకు అలాంటి ఫీలింగ్‌ రానే రాలేదు. అంతో కొంతో ఉపయోగపడిన సినిమా అంటే ‘ఖుషి’ (Kushi) అని చెప్పాలి. అయితే అది కమర్షియల్‌ హిట్‌ కాదు అని విశ్లేషకులు చెబుతుంటారు. ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్‌’తో  (The Family Star) ఏమన్నా బలంగా బౌన్స్‌ బ్యాక్‌ అవుతాడా? అని చూస్తే ఆ సినిమా రెస్పాన్స్‌ సరిగ్గా లేదు.

సినిమా వచ్చి రెండు, మూడు రోజులకే సినిమా ఫలితాన్ని పూర్తిగా చెప్పలేం కానీ.. ఎర్లీ ట్రెండ్‌ అయితే సినిమాకు సరైన విజయం రాలేదు అనే చెబుతున్నారు. పూర్తి ఫలితం వచ్చాక ఆ లెక్కలు చూడొచ్చు కానీ.. ఇప్పుడు అయితే కథల ఎంపిక విషయంలో, వాటిని ప్రచారం చేసుకునే విషయంలో విజయ్ దేవరకొండ మరోసారి తన స్ట్రాటజీని సరి చూసుకోవాలని అభిమానులు, నెటిజన్లు అంటున్నారు. ఎందుకంటే ఆరేళ్లుగా సరైన విజయం అందుకోకపోవడమే కారణం.

అయితే ఇక్కడే ఓ సమస్య వచ్చింది. సినిమాలు తేడా కొడుతున్నా ఆయన కథల ఎంపిక మారడం, సినిమాల ప్రచారం విషయంలో ఆలోచనా మారడం లేదు. సేమ్‌ అగ్రెసివ్‌నెస్‌ను మెయింటైన్‌ చేస్తున్నాడు. దాంతోపాటు ఒకే తరహా కామెంట్లు కూడా చేస్తున్నాడు. సినిమాకు హైప్‌ పెంచలా డైలాగ్‌లు కూడా వేస్తున్నాడు. ‘లైగర్‌’  (Liger)  సినిమాకు వాట్‌ లగాదేంగే అని హైప్‌ ఇవ్వగా… ఈసారి కలకాలం నిలిచే సినిమా అని హైప్‌ పెంచాడు.

ఇంటర్వ్యూలో ఎలివేషన్లు, కెరీర్లో పడ్డ కష్టాలు, కెరీర్‌ ప్రారంభం నాటి రోజులు గుర్తుచేస్తూ ఓ చిన్నసైజు సింపతీ గెయిన్‌ చేయాలని చూస్తున్నారు అంటూ నెటిజన్లు నుండి కామెంట్లు వస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే హిట్‌ కొట్టాక ఎన్ని మాటలు చెప్పినా ఓకే… కానీ ఇలా సరైన విజయం లేకుండా మాట్లాడితే రెస్పాన్స్‌ అస్సలు బాగోదు అనేది జనాల మాట.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.