March 22, 202508:08:06 AM

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ స్టార్ అని చెప్పడానికి ఇదే నిదర్శనం..!

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోల్లో ఒకరు. పెద్దగా సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా స్టార్ డం సంపాదించుకోవడం అన్నది చెప్పుకోదగ్గ విషయమే. అయితే విజయ్ దేవరకొండ తన మార్కెట్ కి తగ్గట్టు సంపాదించుకుంటున్నాడా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేం. స్టార్ అయ్యాక.. మెయింటెనెన్స్ పెరుగుతుంది. మేనేజర్లు, పీఆర్ టీం..లు, యాడ్స్ తెచ్చిపెట్టే బ్యాచ్, ప్రమోషన్స్ టీం, ఆఫీస్ రెంట్లు.. ఇలాంటి వాటితో కలిపి.. లక్షల్లో ఖర్చవుతుంది.

సినిమా రిలీజ్ అయినా అవ్వకపోయినా.. నెలలు తరబడి ఇలాంటి మెయింటెనెన్స్ ..లు ఉంటూనే ఉంటాయి. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. విజయ్ పారితోషికం ఎంతై ఉంటుంది అనే డౌట్ అందరిలో ఉంది. ఎందుకంటే.. విజయ్ ఇటీవల ఓ సందర్భంగా డబ్బులకి టైట్ గా ఉండి దిల్ రాజుని అడ్వాన్స్ వేయమని కోరినట్టు చెప్పాడు. దాని వల్ల ఈ టాపిక్ బాగా హైలెట్ అయ్యింది.ఇక అందుతున్న సమాచారం ప్రకారం…. విజయ్ దేవరకొండ మార్కెట్ ప్రకారం ఇప్పుడు రూ.20 కోట్ల వరకు పారితోషికం ఉంటుందట. కానీ అది ‘ఖుషి’ నుండే అని వినికిడి.

‘లైగర్’ సినిమాకి గాను విజయ్ కి డిజిటల్ రైట్స్ పై వచ్చేదంతా పారితోషికం ఆఫర్ చేశారు. దాని వ్యాల్యూ రూ.20 కోట్లు ఉంటుందని చెప్పి రూ.8 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారట. కానీ రిలీజ్ టైంకి రూ.3 కోట్లు ఇచ్చారట. ఇక సినిమా రిలీజ్ అయ్యాక డిజాస్టర్ టాక్ రావడం .. డిజిటల్ రైట్స్ బిజినెస్ కూడా డిలే అవ్వడంతో విజయ్.. బ్యాలెన్స్ అమౌంట్ కోసం డిమాండ్ చేయలేదట. ‘ఖుషి’ ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రాలకి మాత్రం రిజల్ట్ తో సంబంధం లేకుండా అతను రూ.20 కోట్లు పారితోషికం అందుకున్నట్టు తెలుస్తుంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.