March 28, 202503:18:24 AM

Amitabh Bachchan: ఇదే ముగింపు కాదు మై డియర్.. ఓదారుస్తూ అమితాబ్ ఆసక్తికర పోస్ట్!

బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో అమితాబ్ కు (Amitabh Bachchan) ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాలో అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన నటించడం వల్ల బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కల్కి సినిమాతో అమితాబ్ ఖాతాలో మరో భారీ సక్సెస్ చేరుతుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం రోజున జరిగిన చివరి ఐపీఎల్ మ్యాచ్ లో ఎస్.ఆర్.హెచ్ ఓడిపోవడంతో కావ్య మారన్ ఎమోషనల్ అయ్యారు.

కళ్ల ముందే జట్టు ఓటమిపాలు అవ్వడం ఆమె తట్టుకోలేకపోయారు. ఆమె తన కన్నీళ్లను దిగమింగుకునే ప్రయత్నం చేశారు. వెనక్కు తిరిగి కావ్య మారన్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. వైరల్ అవుతున్న వీడియో గురించి బిగ్ బీ అమితాబ్ స్పందించారు. ఐపీఎల్ ముగిసిందని ఫైనల్ లో కేకేఆర్ అద్భుతంగా ఆడి గెలిచిందని ఎస్.ఆర్.హెచ్ పేలవంగా ఆడిందని ఆయన అన్నారు.

నిజానికి సన్ రైజర్స్ మంచి టీమ్ అని ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ లలో మంచి పర్ఫామెన్స్ ఇచ్చిందని అమితాబ్ పేర్కొన్నారు. కానీ ఫైనల్ లోనే నిరాశ పరిచిందని ఆయన తెలిపారు. మరింత బాధ కలిగించే విషయం ఏంటంటే కావ్య మారన్ స్టేడియంలోనే ఏడ్చేశారని అమితాబ్ చెప్పుకొచ్చారు.

కెమెరాల కంట పడకూడదని వెనక్కు తిరిగి కన్నీళ్ల రూపంలో ఆమె బాధను వదిలేశారని అమితాబ్ కామెంట్లు చేశారు. కావ్య మారన్ ను అలా చూస్తే బాధేసిందని ఇదే ముగింపు కాదు మై డియర్ రేపు అనేది ఒకటి ఉందంటూ ఆమితాబ్ కావ్యను ఓదార్చారు. అమితాబ్ కావ్యను ఓదార్చిన తీరును నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. కల్కితో అమితాబ్ ఖాతాలో బిగ్ హిట్ చేరాలని అభిమానులు ఫీలవుతున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.